Akira Nandan: మోదీకి వారసుడిని పరిచయం చేసిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:32 PM

నరేంద్ర మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన వారసుడు అకీరా నందన్‌‌ను మోదీకి పరిచయం చేశారు. ఈ భేటీలో అకీరా నందన్ భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అకీరా నందన్ పేరు సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Akira Nandan: మోదీకి వారసుడిని పరిచయం చేసిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్
Pawan Kalyan Family Meets Narendra Modi

నరేంద్ర మోదీని (Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన వారసుడు అకీరా నందన్‌‌ (Akira Nandan)ను మోదీకి పరిచయం చేశారు. ఈ భేటీలో అకీరా నందన్ భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ అలాగే 2 ఎంపీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించి నూటికి నూరు శాతం సక్సెస్ రేట్‌ను సొంతం చేసుకుంది. పవన్ విజయం (Pawan Victory)పై మెగా ఫ్యామిలీ (Mega Family) ఎంతో సంతోషంగా ఉంది.

Akira-Nandan-1.jpg

నిన్న(బుధవారం) సాయంత్రం ఢిల్లీ (Delhi)లోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. మోదీ నివాసంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మోదీని (Narendra Modi) ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 8వ తేదీ లేదా 9న మోదీ, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read- Pawan Kalyan: పవర్ స్టార్ నిజజీవితంలో కూడా పవర్ ఫుల్, హోమ్ మినిస్టర్?


Akira-Nandan-2.jpg

Also Read- Akira Nandan: నాన్న కోసం.. అకీరా నందన్ టాలెంట్‌కు అంతా ఫిదా!

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) విజయంపై అకీరా నందన్ ఎడిట్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఆ వీడియోను అకీరా మదర్, పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ (Renu Desai) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇల్లేమో దూరం.. అసలే చీకటి, గాడాంధకారం.. దారంతా గతుకులు.. చేతిలో దీపం లేదు.. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది..’ అంటూ పవన్ కళ్యాణ్ మొదటి పొలిటికల్ సమావేశంలో చెప్పిన డైలాగ్‌తో ఈ వీడియో మొదలైంది.

Akira-Nandan-3.jpg

ఆ తర్వాత తమ్ముడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఖుషి, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్, తీన్‌మార్, గబ్బర్ సింగ్, పంజా, వకీల్ సాబ్, జల్సా సినిమాలలోని పవర్‌ఫుల్ సీన్లు తీసుకొని వీడియోని, బ్యాగ్రౌండ్‌లో మైకెల్ జాక్సన్ ఫేమస్ సాంగ్‌తో అకీరా ఎడిట్ (Akira Edited Video) చేసిన తీరు నిజంగా ఫ్యాన్స్‌కు అయితే గూజ్‌బంప్స్ తెప్పిస్తోంది. అకీరా నందన్ టాలెంట్‌కు మెగాభిమానులే కాకుండా.. నెటిజన్లు ఎందరో ఫిదా అవుతున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అకీరా నందన్ పేరు సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 06 , 2024 | 04:58 PM