i20 Movie: ‘ఐ-20’ ప్రచారం చిత్రం, పాటలు విడుదల

ABN , Publish Date - May 18 , 2024 | 07:49 PM

పి.ఎన్.ఆర్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై సూగూరి రవీంద్ర దర్శకత్వంలో పి.బి. మహేంద్ర నిర్మించిన న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ - 20’. బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. కొమ్ము మనోహర దేవి సహ నిర్మాత. సూర్యరాజ్ - మెరీనా సింగ్ జంటగా నటించిన ఈ చిత్ర పాటలు, ప్రచారచిత్రం విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.

i20 Movie: ‘ఐ-20’ ప్రచారం చిత్రం, పాటలు విడుదల
i20 Movie Audio Launch Event

పి.ఎన్.ఆర్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై సూగూరి రవీంద్ర దర్శకత్వంలో పి.బి. మహేంద్ర నిర్మించిన న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ - 20’ (i 20 Movie). బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. కొమ్ము మనోహర దేవి సహ నిర్మాత. సూర్యరాజ్ - మెరీనా సింగ్ జంటగా నటించిన ఈ చిత్ర పాటలు, ప్రచారచిత్రం విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. మధుర ఆడియో ద్వారా ఈ చిత్ర పాటలు విడుదలయ్యాయి. (i 20 Movie Audio Launch)

*Chitrangada Singh: ఆమె వయసు 48, కానీ ఆమెని చూస్తే అబ్బ...


Damodar-Ramu.jpg

ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కించిన ఈ ‘ఐ-20’ చిత్రం అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు. రాగిణి, లీరిషా (సూపర్ ఉమెన్), చిత్రం శ్రీను, జోష్ రవి, పొట్టి చిట్టిబాబు, సద్దాం హుస్సేన్, రియాజ్, పర్శ, పల్లెమోని శ్రీనివాస్, వినోద్ నాయక్ తదితరులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి మహావీర్ యెలెందర్ సంగీతం అందించారు. (i 20 Telugu Movie)

Read Latest Cinema News

Updated Date - May 18 , 2024 | 07:49 PM