Nagababu: నాగబాబుకి కీలక పదవి? సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్త

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:15 PM

ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీకి, అభర్ధుల విజయానికి తన్వంతో సాయం చేసిన కొణిదెల నాగబాబు రాబోయే రోజుల్లో ఒక కీలక పదవి రాబోతోంది అన్న వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Nagababu: నాగబాబుకి కీలక పదవి? సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్త
Konidela Nagababu

మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నూటికి నూరు శాతం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నిలబెట్టిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లోనూ అఖండ విజయం సాధించి తన పార్టీ వందశాతం విజయాన్ని నమోదు చేసుకొని రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్. అయితే ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన బంధువులు ఎవరినీ తన పార్టీ తరపున నిలబెట్టలేదు. (News doing rounds that Konidela Nagababu is going to appoint as TTD Chairman)

ముఖ్యంగా తన సోదరుడు నాగబాబుని కూడా ఎక్కడా నిలబెట్టలేదు. నాగబాబు మొదటినుండీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటూ, పార్టీకి ఎంతో సేవ చేశారు. ఒక సమయంలో నాగబాబుని అనకాపల్లి నుండి జనసేన పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టాలని వార్తలు వచ్చాయి, అలాగే నాగబాబు కూడా కొన్ని రోజులు అనకాపల్లిలో ఉండటం వలన ఈ వార్తలకి బలం చేకూరింది. కానీ అనూహ్యంగా నాగబాబుకు బదులు ఆ పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించడం, అక్కడ నుండి సీఎం రమేష్ పోటీ చేసి గెలవటం అవన్నీ తెలిసిన విషయాలే.

Pawan-Nagababu.jpg

అయితే ఇప్పుడు నాగబాబు కి ఏదైనా ఒక కీలక పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలిసింది. అందుకే రాష్ట్రంలో అతి ముఖ్యమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలిసింది. అలాగే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ కూడా అవుతోంది. మెగా అభిమానులు కూడా నాగబాబు టీటీడీ చైర్మన్ గా భాద్యతలు చేపట్ట నున్నారని సంబరాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలిసింది. టీటీడీ లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, అందుకు ఎంతో ప్రక్షాళన చెయ్యాల్సి ఉందని, అందుకోసమే నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలుస్తోంది. (News doing rounds on social media that Konidela Nagababu is the new chairman of Tirumala Tirumapathi Devasthanams)

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన తరువాత నాగబాబుని టీటీడీ చైర్మన్ గా చేస్తూ అధికారిక ప్రకటన వెలువడవచ్చు అని కూడా అంటున్నారు. చంద్రబాబు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయవచ్చు అని కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - Jun 06 , 2024 | 04:13 PM