Honeymoon Express: ‘బాహుబలి’ రచయిత వదిలిన రెండో పాట.. ఆస్కార్ విజేత ప్రశంసలు

ABN , Publish Date - Feb 03 , 2024 | 09:15 PM

ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో.. న్యూ రీల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై.. చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాల రాజశేఖరుని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర సెకండ్ సింగిల్‌ను తాజాగా బాహుబలి రచయిత వి విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Honeymoon Express: ‘బాహుబలి’ రచయిత వదిలిన రెండో పాట.. ఆస్కార్ విజేత ప్రశంసలు
Chaitanya Rao and Hebah Patel

ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ (యుఎస్ఎ) (NRI Entertainments USA) సమర్పణలో.. న్యూ రీల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకంపై.. చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express). తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత, దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ‌ని నిర్మించారు. తాజాగా చిత్ర సంగీతం దర్శకుడు కళ్యాణి మాలిక్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన స్వరపరిచిన మరో రొమాంటిక్ పాట ‘ప్రేమ’ను.. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ (V Vijayendra Prasad) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

V-vijayendra-prasad.jpg

పాట విడుదల అనంతరం రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ ప్రేమ పాట చాలా బాగుంది. ఈ పాటతో పాటు.. సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ అందమైన ప్రేమ గీతానికి అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ప్రాణం పోశారు. విశేషం ఏమిటంటే.. ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు ఆర్ పి పట్నాయక్, గోపి మోహన్, చైతన్య ప్రసాద్, రవి వర్మ తదితరులు ప్రత్యక్షం‌గానూ.., ఆస్కార్ అవార్డు విజేత ఎమ్ ఎమ్ కీరవాణి, అవసరాల శ్రీనివాస్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి వారు వీడియో కాల్స్ ద్వారా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేయడం. (Honeymoon Express Songs)


Prema.jpg

ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి (MM Keeravani) వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. కళ్యాణి మాలిక్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇటీవల విడుదలైన ‘నిజమా’ పాట అద్భుతంగా ఉందిని, యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుందని కొనియాడారు. ఇప్పుడు రెండో పాట ‘ప్రేమ’కి కూడా మరింత ఆదరణ లభించాలని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ‘ప్రేమ’ పాట శ్రోతలను బాగా ఆకర్షిస్తూ.. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Natti Kumar: గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదా?

**********************

*Operation Valentine: వరుణ్ తేజ్ సినిమా విడుదల తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

**************************

*Natti Kumar: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం

**************************

*‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?

**************************

*Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..

*************************

Updated Date - Feb 03 , 2024 | 09:15 PM