Honeymoon Express: ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌’కు కింగ్ నాగార్జున గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2023-12-16T15:11:29+05:30 IST

ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాల రాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని.. బిగ్‌బాస్ హౌస్‌లోని నాగ్ రూమ్‌లో నాగార్జున చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Honeymoon Express: ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌’కు కింగ్ నాగార్జున గ్రీన్ సిగ్నల్
Honeymoon Express First Look Poster Launch

ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకం పై చైతన్య రావు (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah Patel) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని (Bala Rajasekharuni) రచయత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను కెకెఆర్, బాల రాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express) ఫస్ట్ లుక్ పోస్టర్‌ని బిగ్‌బాస్ సెట్‌లో హోస్ట్ కింగ్ నాగార్జున రూమ్‌లో.. కింగ్ నాగార్జున చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మాట్లాడుతూ.. దర్శకుడు బాల నాకు సుపరిచితుడు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి డీన్‌గా వ్యవహరించి, హాలీవుడ్ సినీ నిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇచ్చారు. అంతేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకు ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సినిమాలో అవకాశం సైతం ఇచ్చారు. ఈ చిత్ర కథ వినోదాత్మకంగా సమాజానికి చక్కని సందేశం ఇచ్చేదిగా ఉంటుంది. కళ్యాణి మాలిక్‌గారి పాటలు చాలా బాగా వచ్చాయని తెలిసింది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని అన్నారు.


Honeymoon-Express.jpg

దర్శకుడు బాల రాజశేఖరుని (Bala Rajasekharuni) మాట్లాడుతూ.. ‘‘నేను లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకి పని చేశాను కానీ తెలుగు సినిమా చేయాలి అనేది నా కల. శ్రీమతి అక్కినేని అమల (Amala Akkineni) గారి ప్రోద్భలంతో ఇండియా తిరిగివచ్చి అమల‌గారు మరియు నాగార్జునగారి ప్రోత్సాహంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేశాను. నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ నా చిత్రం యొక్క మొదటి పోస్టర్‌ను విడుదల చేసిన కింగ్ నాగార్జున‌గారికి నా కృతజ్ఞతలు. సినిమా విషయానికి వస్తే.. ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. చైతన్య రావు, హెబ్బా పటేల్ అద్భుతంగా నటించారు. తనికెళ్ల భరణి మరియు సుహాసినిగార్ల క్యారెక్టర్లు మా చిత్రానికి హైలైట్‌గా ఉంటాయి. యూత్‌కి, ప్రేమికులకి మా చిత్రం అద్భుతంగా నచ్చుతుంది. త్వరలో రిలీజ్ వివరాలతో మీ ముందుకు వస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్

*************************************

*Naga Vamsi: ‘ఓ మై బేబీ’ పాట ట్రోలింగ్‌పై మంకీలతో పోల్చుతూ.. మళ్లీ వివరణ

*********************************

*Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!

***********************************

Updated Date - 2023-12-16T15:11:31+05:30 IST