Director Maruthi: ‘ట్రూ లవర్’ జంటతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాం

ABN , Publish Date - Feb 08 , 2024 | 05:32 PM

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్నా రవి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ట్రూ లవర్’. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమకథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఈ మూవీని ఫిబ్రవరి 10న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Director Maruthi: ‘ట్రూ లవర్’ జంటతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాం
Director Maruthi

మణికందన్ (Manikandan), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya), కన్నా రవి (Kanna Ravi) ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ట్రూ లవర్’ (True Lover). ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ (Prabhuram Vyas) ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘ట్రూ లవర్’ సినిమా ఈ నెల 10వ తేదీన గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్‌మెంట్ కలిగిందో.. తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్‌లు చూస్తున్నప్పుడు కూడా అంతే సంతోషం కలిగింది. ‘ట్రూ లవర్’ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌గా తెరకెక్కించాడు. చాలా డీప్‌గా థింక్ చేసి స్క్రిప్ట్ చేశాడు. డైరెక్టర్‌గా ప్రభురామ్ వ్యాస్ టాలెంట్ ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాతో ఈ వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. (Director Maruthi Speech at True Lover Pre Release Event)


Maruthi.jpg

మణికందన్, శ్రీ గౌరి ప్రియ నటన ఈ ‘ట్రూ లవర్’ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతాయి. ఈ జంటతో మా మాస్ మూవీ మేకర్స్ బ్యానరలో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తాం. ఎస్‌కేఎన్ ‘బేబి’ చేసినా, నేను ఇప్పుడు ప్రభాస్‌గారితో సినిమా చేస్తూ బిజీగా ఉన్నా.. ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. రేపు (శుక్రవారం) రాత్రి ప్రీమియర్స్ వేస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ అంతా ‘ట్రూ లవర్’ను ఇష్టపడతారని ఆశిస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్‌తో సినిమా రాలేదు. తను ప్రేమించిన అమ్మాయి వేరే వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ తనను అవైడ్ చేస్తే ఆ పెయిన్ ఎంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీన్ని దర్శకుడు చాలా న్యాచురల్‌గా చూపించాడని అనిపించింది..’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*ప్రకటనలతో సరిపెట్టొద్దు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లండి: విజయ్‌కి ఈ సూచన ఎవరిచ్చారో తెలుసా..?

****************************

*Lal Salaam Trailer: ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. తలైవా డైలాగ్ వైరల్

*************************

*Vishal: పొలిటికల్ ఎంట్రీ, నూతన పార్టీ వార్తలపై విశాల్ ఏమన్నారంటే..

***********************

Updated Date - Feb 08 , 2024 | 05:32 PM