ప్రకటనలతో సరిపెట్టొద్దు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లండి: విజయ్‌కి ఈ సూచన ఎవరిచ్చారో తెలుసా..?

ABN , Publish Date - Feb 08 , 2024 | 01:59 PM

‘అగ్రహీరోగా ఉన్న విజయ్‌ రాజకీయ పార్టీని స్థాపించారు. చిత్రపరిశ్రమ తరపున ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆయన రాజకీయాల్లో విజయం సాధించాలంటే మహానేత ఎంజీఆర్‌ చేసిన సేవలో కనీసం 15 శాతమైనా చేయాలి. ప్రజాక్షేత్రానికి వెళ్ళి వారితో మమేకం కావాలి.. అని అన్నారు కోలీవుడ్ ప్రముఖ నిర్మాత కె. రాజన్. ‘నినైవెల్లాం నీయడా’ ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రకటనలతో సరిపెట్టొద్దు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లండి: విజయ్‌కి ఈ సూచన ఎవరిచ్చారో తెలుసా..?
Vijay

కొందరు వ్యక్తులతో రాజకీయ ప్రకటనలు చేయించి.. ఆ తర్వాత చేతులు దులుపుకోవద్దని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సాధకబాధకాలను తెలుసుకోవాలని హీరో విజయ్‌ (Vijay)కు సీనియర్‌ నిర్మాత కె. రాజన్‌ (K. Rajan) సూచించారు. విజయ్‌ ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీని స్థాపించడంపై రాజన్‌ ఈ విధంగా స్పందించారు. లేఖా థియేటర్స్‌ పతాకంపై రాయల్‌ బాబు నిర్మాణ సారథ్యంలో ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా సంగీత స్వరాలు సమకూర్చిన 1,417వ చిత్రం ‘నినైవెల్లాం నీయడా’ (Ninaivellam Neeyada). ప్రిజన్‌, మధుమిత, యువలక్ష్మి, సినామికా, కోమల్‌ శర్మ, రోహిత్‌ తదితరులు నటించారు. ఆదిరాజన్‌ దర్శకుడు. ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యక్రమం తాజాగా చెన్నై నగరంలో జరిగింది.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత కె. రాజన్‌ మాట్లాడుతూ.. ‘‘అగ్రహీరోగా ఉన్న విజయ్‌ రాజకీయ పార్టీని స్థాపించారు. చిత్రపరిశ్రమ తరపున ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆయన రాజకీయాల్లో విజయం సాధించాలంటే మహానేత ఎంజీఆర్‌ చేసిన సేవలో కనీసం 15 శాతమైనా చేయాలి. ప్రజాక్షేత్రానికి వెళ్ళి వారితో మమేకం కావాలి. రూ.200 కోట్ల పారితోషికం వద్దని ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నారంటే నిజంగానే విజయ్‌ను అభినందించాలి’’ అని అన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ... ‘నేను విజయ్‌కు విశ్వాసపాత్రుడిగానే ఉంటాను’ అని అన్నారు.


K-Rajan.jpg

మరో దర్శకుడు ఆర్‌.వి. ఉదయకుమార్‌ మాట్లాడుతూ.. అన్ని రకాల ఎమోషన్స్‌కు సంగీతం అందించిన మేధావి ఇళయరాజా. ఇలాంటి ప్రేమకథలకు సంగీతం సమకూర్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ చిత్ర హీరోయిన్‌ యువలక్ష్మికి ఈ సినిమాలోని పాటల ద్వారానే మంచి గుర్తింపు లభిస్తుందనిని అన్నారు. చిత్ర దర్శకుడు ఆదిరాజన్‌ మాట్లాడుతూ... ఇళయరాజాతో కలిసి పనిచేయడం జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకమని అన్నారు. ‘ప్రసవానికి మూడు రోజులకు ముందు కూడా ఈ సినిమా కోసం పనిచేయడం మరిచిపోలేని అనుభూతి’ అని నటి మధుమిత అన్నారు. సినీ గేయ రచయిత స్నేహన్‌ మాట్లాడుతూ... ‘కమర్షియల్‌ పాటలు నా చిరునామా కాదు’ అని అన్నారు. అలాగే, నటి కోమల్‌ శర్మ, రెండో హీరోయిన్‌ సినామికా, రెండో హీరో రోహిత్‌, నటి యువలక్ష్మి, దర్శకుడు కేఆర్‌, హీరో ప్రిజన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Lal Salaam Trailer: ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. తలైవా డైలాగ్ వైరల్

*************************

*Vishal: పొలిటికల్ ఎంట్రీ, నూతన పార్టీ వార్తలపై విశాల్ ఏమన్నారంటే..

***********************

*Kiran Abbavaram: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్

**************************

*RRR: జక్కన్నపై మరోసారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రశంసలు

******************************

Updated Date - Feb 08 , 2024 | 01:59 PM