Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

ABN , Publish Date - Jan 02 , 2024 | 09:34 PM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ మూవీ రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ.. డే 1 కంటే డే 4 అత్యధిక కలెక్షన్స్ రాబట్టి.. టోటల్‌గా 4 రోజులకి ఈ సినిమా రూ.22.59 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది.

Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
Kalyan Ram in Devil Movie

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’ (Devil). ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ (Abhishek Pictures) బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా (Abhishek Nama) ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ మూవీ రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ.. డే 1 కంటే డే 4 అత్యధిక కలెక్షన్స్ రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పీరియాడిక్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్‌కు మాంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. అటు అభిమానులు, ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా ఈ సినిమా అందుకుంటోంది. సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) తనదైన శైలిలో చక్కటి నటనతో అందరి ప్రశంసలను అందుకుంటున్నారు.

‘డెవిల్’ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. తొలి రోజున ఈ చిత్రం రూ. 4.92 కోట్లను రాబట్టింది. కొత్త ఏడాది ప్రారంభం కావటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్‌ను రాబట్టుకుంటోంది. దీంతో మొత్తంగా.. నాలుగు రోజులకి ఈ సినిమా రూ.22.59 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. సంక్రాంతి రానుండటంతో పాటు.. వారాంతం కలిసి రావటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఇదే స్పీడుని ఇంకా కొనసాగిస్తుందని.. వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే బాక్సాఫీస్‌కి డెవిల్‌తో సరికొత్త ఎనర్జీ వచ్చినట్టుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. (Devil Movie Collections)


Kalyan-Ram.jpg

ఆసక్తికరమైన కథ, కథనాలతో డెవిల్ సినిమా థ్రిల్లర్ ప్రియులను, కమర్షియల్ సినీ ప్రేమికులకు అలరిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ‘యానిమల్’ (Animal) ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!

****************************

*Mangai: తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

************************

*Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..

****************************

*SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

************************

Updated Date - Jan 02 , 2024 | 09:34 PM