Prasanth Varma: రణ్‌వీర్ సింగ్‌‌తో సినిమా.. ఆ వార్తలు అవాస్తవం!

ABN , Publish Date - May 25 , 2024 | 09:24 PM

‘జై హనుమాన్‌’తో పాటుగా.. ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌‌ను నిర్మించనుందని, గ్రాండ్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వచ్చిన కొన్ని రోజులకే.. ఈ సినిమా క్రియేటివ్ డిఫరెన్సెస్‌ల కారణంగా రద్దయిందనేలా మళ్లీ వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలపై తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.

Prasanth Varma: రణ్‌వీర్ సింగ్‌‌తో సినిమా.. ఆ వార్తలు అవాస్తవం!
Prasanth Varma and Ranveer Singh

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ‘హనుమాన్‌’ (Hanuman)తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన తర్వాత సీక్వెల్ ‘జై హనుమాన్‌’ (Jai Hanuman)తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతున్నారు. రీసెంట్‌గా ‘జై హనుమాన్‌’కు సంబంధించి ఓ పోస్టర్ విడుదలై వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ (Ranveer Singh)తో ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌‌ను నిర్మించనుందని, గ్రాండ్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వచ్చిన కొన్ని రోజులకే.. ఈ సినిమా క్రియేటివ్ డిఫరెన్సెస్‌ల కారణంగా రద్దయిందనేలా మళ్లీ వార్తలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలలో ఎటువంటి వాస్తవం లేదని మేకర్స్ శనివారం అధికారికంగా తెలియజేశారు.

*Hema Rave Party: హేమపై ‘మా’ యాక్షన్ వార్తలపై.. మంచు విష్ణు ఏమన్నారంటే?


Prasanth-Varma.jpg

‘‘ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయిందనేలా వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆ ప్రాజెక్ట్ రద్దు కాలేదు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ పూర్తయింది. రీసెంట్‌గా ఫొటో షూట్ అలాగే ప్రోమో షూట్ కూడా పూర్తి చేశాం. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. మైథలాజికల్ జానర్‌లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం రూ. 200 కోట్ల బడ్జెట్‌తో గ్రాండ్‌గా తెరకెక్కించబోతున్నారని సమాచారం. పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా తెలియజేయనున్నారు. (Makers Clarity on Ranveer Singh and Prasanth Varma Project)

Read Latest Cinema News

Updated Date - May 25 , 2024 | 09:24 PM