Prasanth Varma: ఆ సన్నివేశాలు నేనైతే బాగా తీసేవాడిని.. ఆదిపురుష్‌పై సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jan 27 , 2024 | 10:10 PM

‘ఆదిపురుష్‌’(Adipurush)లోని కొన్ని సన్నివేశాలు నాకెంతో నచ్చాయి. వాటిని తెరకెక్కించిన తీరు ఆశ్చర్యపరిచింది. అయితే, కొన్ని సీన్స్‌ తీర్చిదిద్దిన తీరు నాకే మాత్రం నచ్చలేదు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

Prasanth Varma: ఆ సన్నివేశాలు నేనైతే బాగా తీసేవాడిని.. ఆదిపురుష్‌పై సంచలన వ్యాఖ్యలు!

‘‘ఆదిపురుష్‌’(Adipurush)లోని కొన్ని సన్నివేశాలు నాకెంతో నచ్చాయి. వాటిని తెరకెక్కించిన తీరు ఆశ్చర్యపరిచింది. అయితే, కొన్ని సీన్స్‌ తీర్చిదిద్దిన తీరు నాకే మాత్రం నచ్చలేదు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హను-మాన్‌ (Hanuman)చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఆదిపురుష్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆదిపురుష్‌’లోని కొన్ని సన్నివేశాలు నాకెంతో నచ్చాయి. వాటిని తెరకెక్కించిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. అయితే, కొన్ని సీన్స్‌ తీర్చిదిద్దిన తీరు నాకేమాత్రం నచ్చలేదు. నేనే అయితే వాటిని ఇంకా బాగా చేసేవాడిని కదా అనిపించింది. నాకే కాదు.. ఏ ఫిల్మ్‌ మేకర్‌కి అయినా ఆ భావన కలుగుతుంది. ఆ సినిమా ఫలితం నాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. టీమ్‌ అందరి సహకారంతో నేను అనుకున్న విధంగా ‘హను-మాన్‌’ను తెరకెక్కించగలిగా. ఇది నేను ఊహించిన విజయమే. ఈ సినిమాకి వచ్చిన స్పందన చూసిన తర్వాత కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యత పెంచింది. మంచి సినిమాలు తీసి పరిశ్రమ మేలుకు నా వంతు కృషి చేస్తాను. .ఈ సక్సెస్‌ను అందించిన ప్రేక్షకుల అందరి రుణం 'జై హనుమాన్‌’తో తీర్చుకోబోతున్నాను, జై హనుమాన్‌.. హనుమాన్‌కి వందరెట్లు ఉండబోతుంది. ఇంటర్‌నేషనల్‌ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత త్వరగా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం’’ అని అన్నారు.

Updated Date - Jan 27 , 2024 | 10:10 PM