Prasanth Varma: రణ్‌వీర్‌సింగ్‌తో సినిమా.. టైటిల్‌ అదే!

ABN , Publish Date - May 12 , 2024 | 05:32 PM

‘హనుమాన్‌’ చిత్రంతో ప్రశాంత వర్మ క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. ఆయన కోసం బాలీవుడ్‌ హీరోలు నిర్మాణ సంస్థలు ఆరా తీసేంత పేరు తెచ్చుకున్నారు.

Prasanth Varma: రణ్‌వీర్‌సింగ్‌తో సినిమా.. టైటిల్‌ అదే!

‘హనుమాన్‌’ (Hanuman)చిత్రంతో ప్రశాంత వర్మ (Prashanth varma) క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. ఆయన కోసం బాలీవుడ్‌ హీరోలు నిర్మాణ సంస్థలు ఆరా తీసేంత పేరు తెచ్చుకున్నారు. రణ్‌వీర్‌సింగ్‌తో (Ranveer Singh) ఆయనొక సినిమా చేయబోతున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ చిత్రం ఫైనల్‌ అయిందని తెలిసింది. అతి త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి ‘బ్రహ్మరాక్షస’ (Brahma Rakshasa) అనే టైటిల్‌ ఖరారు చేశారు. అన్ని భాషల్లోనూ ఇదే టైటిల్‌తో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.

ప్రశాంత్  వర్మ ఇప్పటి దాకా తీసిన ‘అ’, ‘జాంబిరెడ్డి’, ‘హనుమాన్‌’.. ఒకదానికి ఒకటి సంబంధం లేని కథలే.  ‘బ్రహ్మరాక్షస’ కూడా ఆ తరహా జోనరే. ‘హనుమాన్‌’ నుంచి ప్రశాంత్‌ వర్మ సూపర్‌ హీరోస్‌ కథల వైపు ఆలోచించడం మొదలెట్టాడు. ‘బ్రహ్మరాక్షస’ కూడా ఈ సిరీస్‌లో భాగమే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కథ ఎప్పుడో ఫైనల్‌ అయిపోయింది. ఈ కథకు రణవీర్‌ కూడా ‘ఓకే’ చెప్పేశాడు. హిందీ సినిమాగానే ఈ చిత్రాన్ని పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ‘హనుమాన్‌’కు సీక్వెల్‌గా వస్తున్న జై హనుమాన చిత్రం  2’ పనుల్లో ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ‘బ్రహ్మరాక్షస’ చిత్రం ఉంటుంది.

Updated Date - May 12 , 2024 | 05:33 PM