మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anjali: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. నాకెంతో స్పెషల్ ఫిల్మ్

ABN, Publish Date - Feb 25 , 2024 | 03:43 PM

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా నాకెంతో ప్రత్యేకమైనదని అన్నారు నటి అంజలి. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 22న ఈ సినిమా విడుదలకానుంది.

Geethanjali Malli Vachindi Teaser Launch Event

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) సినిమా నాకెంతో ప్రత్యేకమైనదని అన్నారు నటి అంజలి (Anjali). ఆమె టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ (Kona Venkat) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి (Siva Turlapati) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ వేడుకకు దర్శకుడు బుచ్చిబాబు, బాబీ, గోపీచంద్ మలినేని, హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో

అంజలి మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ‘గీతాంజలి’ (Geethanjali) నాకు ఫస్ట్ సెంట్రిక్ మూవీ. ఇది నాకు 50వ సినిమా. నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మరింత ఎక్కువగా నవ్విస్తుంది.. భయపెడుతుంది. ప్రేక్షకులు థియేటర్లో మంచి అనుభూతిని పొందుతారు. 50 సినిమాలు అనేది స్పెషల్ నంబర్. నాకెంతో ఆనందంగా ఉంది. దర్శకుడు శివకు మంచి భవిష్యత్తు ఉంది. శ్రీనివాసరెడ్డి, రాజేష్, అలీ, షకలక శంకర్, అవినాష్, రాహుల్ ఇలా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం అంతా చాలా కష్టపడి చేశాం. సిద్దు విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ బాగుంటుంది. ఆర్ఆర్, పాటలు బాగా వచ్చాయి. నందు, భాను రైటింగ్ బాగుంది. ఈ చిత్రానికి అన్నీ చక్కగా కుదిరాయి.


కోన గారు ఈ సినిమాకు చాలా ప్రత్యేకం. పదేళ్ల తరువాత కూడా ఈ సినిమాను తీయగలిగాం అంటే.. అది ఆయన వల్లే. ‘నిశ్శబ్దం’ టైంలోనే ఈ మూవీ పాయింట్ చెప్పారు. కానీ కథను రెడీ చేయడానికి ఇంత టైం పట్టింది. కానీ షూటింగ్‌ను మాత్రం చాలా వేగంగా పూర్తి చేశాం. మా ఈవెంట్‌కు అతిథులుగా వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థాంక్స్. శ్రీ విష్ణు (Sree Vishnu) తన సినిమా రిలీజ్ అవుతున్నా కూడా మా కోసం రావడం చాలా గ్రేట్. మా రెండు చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి. మార్చి 22న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయండని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Masthu Shades Unnai Ra: థ్యాంక్స్ మీట్‌‌లో నిర్మాత ఎమోషనల్.. ఎందుకంటే?

*************************

*Nani32: ‘OG’ దర్శకుడితో నాని చిత్రం.. అధికారిక ప్రకటన వచ్చేసింది

*****************************

*Bhimaa Trailer: గోపీచంద్ ఊచకోత..

*****************************

*Chari 111: ‘చారి 111’కు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ సినిమానే స్ఫూర్తి

*************************

Updated Date - Feb 25 , 2024 | 03:43 PM