Masthu Shades Unnai Ra: థ్యాంక్స్ మీట్‌‌లో నిర్మాత ఎమోషనల్.. ఎందుకంటే?

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:14 PM

విల‌క్ష‌ణ డైలాగ్ డెలివ‌రీతో న‌టుడిగా త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభిన‌వ్ గోమ‌ఠం హీరోగా.. వైశాలిరాజ్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 23న విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు.

Masthu Shades Unnai Ra: థ్యాంక్స్ మీట్‌‌లో నిర్మాత ఎమోషనల్.. ఎందుకంటే?

విల‌క్ష‌ణ డైలాగ్ డెలివ‌రీతో న‌టుడిగా త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభిన‌వ్ గోమ‌ఠం (Abhinav Gomatam) హీరోగా.. వైశాలిరాజ్ (Vaishali Raj) హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ (Masthu Shades Unnai Ra). కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 23న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌లైంది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌యవంత‌ంగా థియేటర్లలో ప్ర‌దర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో.. చిన్న సినిమా విడుద‌ల కావాలంటే నేడు ఎంతో క‌ష్టంతో కూడుకున్న వ్యవహారం. ఈ సినిమా గురించి ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నాం. నేడు సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణతో విజ‌యవంతంగా ప్ర‌దర్శింప‌బ‌డుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి నా ధ‌న్య‌వాదాలు అంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు నిర్మాత భ‌వాని కాసుల‌. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. మా చిన్న సినిమాకు మీడియా అందిస్తున్న స‌హ‌కారం మ‌రువ‌లేనిది. వాళ్లు భుజాల‌పై ఈ సినిమాను మోస్తున్నారు. రోజు రోజుకు సినిమా ప‌ట్ల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పెరుగుతుంది. త‌ప్ప‌కుండా మా సినిమాను అంద‌రూ చూసి ఎంక‌రైజ్ చేయాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. (Masthu Shades Unnai Ra Thanks Meet)


Abhinav.jpg

న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం మాట్లాడుతూ.. సినిమా విడుద‌ల వ‌ర‌కు ఎంతో ఒత్తిడి వుండేది. ఫైన‌ల్‌గా సినిమా ప‌ట్ల ప్రేక్ష‌కుల స్పంద‌న చూసి రిలాక్స్ అయ్యాను. నిర్మాత భ‌వాని గారు ఈ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రి శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భించింద‌ని అన్నారు. ఈ స‌మావేశంలో హీరోయిన్ వైశాలి, ర‌చ‌యిత రాధాక్రిష్ణ‌, న‌టులు రోహ‌న్‌రాయ్‌ ఇంకా ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Nani32: ‘OG’ దర్శకుడితో నాని చిత్రం.. అధికారిక ప్రకటన వచ్చేసింది

*****************************

*Bhimaa Trailer: గోపీచంద్ ఊచకోత..

*****************************

*Chari 111: ‘చారి 111’కు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ సినిమానే స్ఫూర్తి

*************************

*Sumaya Reddy: దేవాలయానికి ‘డియర్ ఉమ’ హీరోయిన్ విరాళం

*************************

Updated Date - Feb 25 , 2024 | 03:14 PM