Bhimaa Trailer: గోపీచంద్ ఊచకోత..

ABN , Publish Date - Feb 24 , 2024 | 06:46 PM

మాచో హీరో గోపీచంద్ హీరోగా నటిస్తోన్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భీమా’. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి స్పెషల్‌గా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో గోపీచంద్‌ను సరికొత్తగా చూపిస్తూనే.. ఊచకోత ఎలా ఉంటుందో పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Bhimaa Trailer: గోపీచంద్ ఊచకోత..
Bhimaa Movie Poster

మాచో హీరో గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తోన్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భీమా’ (Bhimaa). ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ (Sri Sathya Sai Arts) పతాకంపై కె కె రాధామోహన్ (KK Radhamohan) నిర్మిస్తున్నారు. టీజర్ నుంచి పాటల వరకు ప్రతీది సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తోంది. మహా శివరాత్రి స్పెషల్‌గా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో గోపీచంద్‌ను సరికొత్తగా చూపిస్తూనే.. ఊచకోత ఎలా ఉంటుందో పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమాలోని ఆధ్యాత్మిక కోణాన్ని చూపిస్తూ ట్రైలర్‌‌ను ప్రారంభించారు. శ్రీమహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసాఫీసర్‌గా గోపీచంద్ పాత్రని రివీల్ చేశారు. అలాగే ఇందులో గోపీచంద్‌లోని మరో పాత్రను కూడా చాలా అద్భుతంగా పరిచయం చేశారు. (Bhimaa Trailer Talk)


GopiChand-Bhimaa.jpg

కన్నడలో స్టార్ దర్శకుడైన హర్ష (A Harsha) లార్జర్ దెన్ లైఫ్ కథతో ఆధ్యాత్మిక కోణాన్ని టచ్ చేస్తూ.. సరికొత్త ఫీల్‌ని ఇచ్చేలా ప్రజంట్ చేస్తున్నారనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. గోపీచంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. అతను కనికరం లేని పోలీసుగా కనిపిస్తుండగా, మరో పాత్ర టెర్రిఫిక్‌గా ఉంది. ట్రైలర్‌లో హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మతో సహా ఇతర పాత్రలను చూపించినప్పటికీ, ప్రధాన దృష్టి గోపీచంద్ యొక్క రెండు పాత్రలపైనే ఉండేలా ట్రైలర్‌ని కట్ చేశారు. సినిమా ప్రధాన అంశాలను చాలా ఎఫెక్టివ్‌గా ఎస్టాబ్లెస్ చేశారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్‌లో ఉంది. ఊచకోత అంటూ గోపీచంద్ పలికే డైలాగ్స్.. అతనిలోని మాస్‌‌ని మరోసారి ప్రజంట్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం. గోపీచంద్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదనేలా.. ‘భీమా’ను భారీ హంగులతో తెరకెక్కిస్తున్నట్లుగా ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Chari 111: ‘చారి 111’కు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ సినిమానే స్ఫూర్తి

*************************

*Sumaya Reddy: దేవాలయానికి ‘డియర్ ఉమ’ హీరోయిన్ విరాళం

*************************

*Tantra: పిల్ల బచ్చాల్లారా.. మా సినిమాకు రావద్దు.. వార్నింగ్ అదిరింది

************************

Updated Date - Feb 24 , 2024 | 06:46 PM