Director Subba Rao Gosangi: ఇకపై నా సినీ జీవితం నా కన్నతల్లి ఒడిలోనే..

ABN , Publish Date - May 22 , 2024 | 05:59 PM

ఇంట గెలిచి రచ్చ గెలిచే దర్శకుల సంఖ్య సహజంగానే చాలా తక్కువుంటుంది. రచ్చ గెలిచి మళ్ళీ ఇంట ‘రచ్చ’ చేసేవారి సంఖ్య మరీ అరుదుగా ఉంటుంది. ఆ అరుదైన జాబితాలోనూ స్థానం సంపాదించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు. చాలా గ్యాప్ తర్వాత ఆయన తెలుగులో డైరెక్ట్ చేసిన చిత్ర ‘బిగ్ బ్రదర్’. ఈ నెల 24న విడుదల కాబోతోన్న ఈ చిత్ర విశేషాలను తాజాగా ఆయన తెలియజేశారు.

Director Subba Rao Gosangi: ఇకపై నా సినీ జీవితం నా కన్నతల్లి ఒడిలోనే..
Director Subba Rao Gosangi

ఇంట గెలిచి రచ్చ గెలిచే దర్శకుల సంఖ్య సహజంగానే చాలా తక్కువుంటుంది. రచ్చ గెలిచి మళ్ళీ ఇంట ‘రచ్చ’ చేసేవారి సంఖ్య మరీ అరుదుగా ఉంటుంది. ఆ అరుదైన జాబితాలోనూ స్థానం సంపాదించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు (Director Subba Rao Gosangi). సుమారు నాలుగు దశాబ్దాల క్రితం (1986లో) దర్శకత్వశాఖలో అరంగేట్రం చేసి, పలువురు దిగ్గజాల దగ్గర శిష్యరికం చేసి, దర్శకత్వంలోని మెళకువలన్నీ ఆకళింపు చేసుకున్న గోసంగి... దర్శకుడిగా తన పరిచయ చిత్రం ‘భవాని’తో సంచలన విజయం అందుకున్నారు. తర్వాత ‘శివుడు, మనమిద్దరం’ చిత్రాలతోనూ మెప్పించిన సుబ్బారావు... అనుకోకుండా భోజపురి (Bhojpuri) చిత్ర రంగప్రవేశం చేసి, అక్కడి పరిశ్రమలో సంచలనానికి పర్యాయపదంగా మారారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ‘అయిదు హ్యాట్రిక్’లు (15 సినిమాలు) సాధించి... తెలుగువారంతా గర్వంగా చెప్పుకునేలా ‘రాజమౌళి ఆఫ్ భోజపురి’గా నీరాజనాలు అందుకుంటున్నారు. గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో భోజపురిలో రూపొంది బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచిన 15 చిత్రాలలో... మూవీ మొఘల్ రామానాయుడు నిర్మించిన చిత్రంతో పాటు... లెజండరీ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్ సోదరుడు సాయిబాబా నిర్మించిన రెండు చిత్రాలు కూడా ఉండడం గమనార్హం.

*Rave Party Hema: ఇది ఆమె నిజ స్వరూపం.. హేమపై సహనటి సంచలన వ్యాఖ్యలు

చాలా విరామం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ... గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించిన ‘బిగ్ బ్రదర్’ (Big Brother) సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై శంకర్ రావు కంఠంనేని - ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో హీరో శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు. జి. రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత. గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో శివ కంఠంనేని (Siva Kantamneni) సరసన ప్రియా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.


Big-Brother.jpg

ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు (Director Subba Rao Gosangi about Big Brother) మాట్లాడుతూ.. ‘‘అనుకోకుండా భోజపురిలో ఎంట్రీ ఇచ్చిన నాపై అక్కడి పరిశ్రమ... అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలతో కట్టిపడేసి దత్తత తీసేసుకుంది. తెలుగు రీ-ఎంట్రీ కోసం ఎప్పటికప్పుడు సన్నాహాలు చేసుకున్నా... భోజపురిలో ఫుల్ బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. మిత్రుడు ఘంటా శ్రీనివాసరావు ఒత్తిడి వల్ల... ఎట్టకేలకు తీరిక చేసుకుని ‘బిగ్ బ్రదర్’తో దర్శకుడిగా నాకు జన్మ ఇచ్చిన కన్నతల్లి ఒడికి చేరుకుంటున్నందుకు చాలా సంతోషంగా, ఎంతో ఉద్వేగంగా ఉంది. ఇకనుంచి నా సినీ జీవితం తెలుగులోనే’’ అని తెలిపారు. ఇకపై వరుసగా తెలుగులో చిత్రాలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న గోసంగి... ఇప్పటికే రెండు సినిమాలకు సంతకాలు చేసినట్లుగానూ, ఆ రెండు ప్రాజెక్ట్స్ ప్రి-ప్రొడక్షన్ దశల్లో ఉన్నట్లుగానూ.. త్వరలోనే వాటి వివరాలను వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది.

Read Latest Cinema News

Updated Date - May 22 , 2024 | 05:59 PM