Varalaxmi Sarath Kumar: పెళ్లి ఎప్పుడో తెలియదు కానీ.. ఆహ్వాన పత్రికలు పంచేస్తున్నారు

ABN , Publish Date - Jun 08 , 2024 | 09:37 PM

సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకు చెందిన వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను వివాహమాడనున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం జరగ్గా త్వరలో వివాహం జరుగనుంది. అయితే, వివాహ తేదీ ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. ఆహ్వాన పత్రికలను మాత్రం రాధికా శరత్‌ కుమార్‌ దంపతులు అందరికీ ఇస్తున్నారు.

Varalaxmi Sarath Kumar: పెళ్లి ఎప్పుడో తెలియదు కానీ.. ఆహ్వాన పత్రికలు పంచేస్తున్నారు
Varalaxmi Sarath Kumar Wedding Cards Distribution

సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar) ముంబైకు చెందిన వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ (Nicholai Sachdev)ను వివాహమాడనున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం జరగ్గా త్వరలో వివాహం జరుగనుంది. అయితే, వివాహ తేదీ ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. ఆహ్వాన పత్రికలను మాత్రం రాధికా శరత్‌ కుమార్‌ దంపతులు అందరికీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల హిమాలయాల్లో తన ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేసుకుని నగరానికి వచ్చిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth)ను కలిసిన పెళ్ళి కుమార్తె వరలక్ష్మి, రాధిక శరత్‌ కుమార్‌ (Radhika Sarath Kumar) దంపతులు, వారి కుటుంబ సభ్యులు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read- RamojiRao: రామోజీరావు.. ఆ కోరిక తీరకుండానే..!

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు కమల్ హాసన్ (Kamal Haasan), డీఎంకే ఉప ప్రధానకార్యదర్శి కనిమొళి (Kanimozhi), తమిళనాడు సీఎం ఎమ్‌కె స్టాలిన్‌‌ (MK Stalin)లకు వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి ఆహ్వాన పత్రికలను (Varalaxmi Sarath Kumar Wedding Cards) అందజేశారు. ఆ ఫొటోలను వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. అయితే అందరూ పెళ్లి ఎప్పుడో చెప్పుకుండా.. ఇలా ఆహ్వాన పత్రికలు పంచడం ఏమిటో? అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. (Varalaxmi Weds Nicholai Sachdev)


Varalaxmi.jpg

ఇదిలా ఉంటే.. వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్‌ సచ్‌దేవ్‌‌ల వివాహం ముంబైలో నిర్వహించి, రిసెప్షన్‌ మాత్రం చెన్నై నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో రాధిక దంపతులు ఉన్నట్టు సమాచారం. కాగా, ‘పోడా పోడి’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి... ఆ తర్వాత ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం ‘క్రాక్‌’, ‘నాంది’, ‘వీరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్‌ పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 08 , 2024 | 09:37 PM