మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Varalakshmi Sarathkumar: జయమ్మ పెళ్లికి సిద్ధం.. గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం!

ABN , Publish Date - Mar 02 , 2024 | 07:22 PM

కోలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ వరలక్ష్మీ శరతకుమార్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఎలాంటి హడావిడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఆమె పెళ్లికి సిద్ధమవుతోందని గత కొన్ని రోజులుగా రూమర్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. వాటిని ఇప్పుడు నిజం చేసింది.

Varalakshmi Sarathkumar:  జయమ్మ పెళ్లికి సిద్ధం.. గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం!

కోలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ వరలక్ష్మీ శరతకుమార్‌ (Vara lakshmi Sarath kumar) త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఎలాంటి హడావిడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఆమె పెళ్లికి సిద్ధమవుతోందని గత కొన్ని రోజులుగా రూమర్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. వాటిని ఇప్పుడు నిజం చేసింది. తాజాగా గ్యాలరిస్ట్‌ నికోలాయి సచ్‌దేవ్‌ (Nicholai suchdev) అనే ఇండస్ట్రీకి  సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. 

Varalakshmi-Sarathkumar--(5.jpgగత 14 ఏళ్ల నుంచి ఇద్దరికీ పరిచయముంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  ఈ ఏడాదిలోనే  వీరిద్దరి పెళ్లి జరగనుందాని తెలుస్తోంది. 

Varalakshmi-Sarathkumar--(3.jpg
తమిళస్టార్‌ శరత్‌ కుమార్‌ వారసురాలిగా వరలక్ష్మి అందరికీ తెలుసు. హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమెకు సరైన సక్సెస్‌ రాకపోవడంతో విలన్ బాట పట్టింది. ఆ పాత్రలు  కలిసి రావడంతో అలానే కొనసాగుతుంది. కొన్నేళ్ల వరకు తమిళంలో స్టార్స్‌లో కలిసి పనిచేసిన ఈమె.. ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉంది. నాంది, క్రాక్‌, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్‌ తదితర చిత్రాలతో వరస హిట్స్‌ అందుకుంది.

Varalakshmi-Sarathkumar--(4.jpg

Updated Date - Mar 02 , 2024 | 07:23 PM