Varalakshmi Sarathkumar: వరు.. పెళ్లి పనులు షురూ!

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:50 PM

కథానాయికగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా  రాణిస్తున్నారు వరలక్ష్మీ శరతకుమార్‌. టాలీవుడ్‌లో బలమైన పాత్రలతో మెప్పిస్తున్నారు.

Varalakshmi Sarathkumar: వరు.. పెళ్లి పనులు షురూ!

కథానాయికగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు వరలక్ష్మీ శరతకుమార్‌ (Varalakshmi Sarath kumar). టాలీవుడ్‌లో బలమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. ఈ మధ్యకాలంతో తెలుగు సినిమాలతో మరింత బిజీ అయ్యారు. ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ప్రియుడు నికోలయ్‌ సచ్‌దేవ్‌తో (Nicholai sachdev) ఏడడుగులు వేయబోతోంది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో పెళ్లి జరగనుందని ప్రచారం కోలీవుడ్‌ మీడియా చెబుతోంది.  పెళ్లి పనులు, పిలుపులు షురూ చేశారు. పెళ్లి పత్రికల పంపిణీ మొదలైంది. గురువారం (జూన్‌ 6న) రజనీకాంత్‌ను కుటుంబ సమేతంగా కలిసి తన పెళ్లికి రమ్మని ఆహ్వానించింది వరు. (Marriage invitation to Rajinikanth)

Varu 2.jpg

ఈ మేరకు రజనీకాంత్‌తో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తలైవా సర్‌ను, లతా ఆంటీని కలిసి పెళ్లికి ఆహ్వానించాను. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్యూ సర్‌. ఐశ్వర్య రజనీకాంత్‌.. ఎప్పటిలాగే నాతో ఎంతో ప్రేమగా మాట్లాడావు అని వరలక్ష్మీ ఇన్ స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఫొటోలో రజనీకాంత్‌ దంపతులతో పాటు వరలక్ష్మి తల్లిదండ్రులు రాధిక - శరత్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 01:53 PM