స్నేహితుడి కోసం వధువును అన్వేషిస్తోన్న నటుడు.. మ్యాటర్ ఏంటంటే?

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:32 AM

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జయంకొండన్‌ త్వరలోనే ఓ ఇంటివాడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తనకు అనుకూలమైన వధువు కోసం గాలిస్తున్నారు. జయంకొండన్‌కు అనుకూలమైన యువతి కోసం అన్వేషించే పనుల్లో నటుడు గంజాకరుప్పు కూడా నిమగ్నమైవున్నారు. తనకు తెలిసినవారి ద్వారా వధువు వివరాలను సేకరిస్తున్నారు.

స్నేహితుడి కోసం వధువును అన్వేషిస్తోన్న నటుడు.. మ్యాటర్ ఏంటంటే?
Ganja Karuppu

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జయంకొండన్‌ (Jayamkondan) త్వరలోనే ఓ ఇంటివాడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తనకు అనుకూలమైన వధువు కోసం గాలిస్తున్నారు. జయంకొండన్‌కు అనుకూలమైన యువతి కోసం అన్వేషించే పనుల్లో నటుడు గంజాకరుప్పు (Ganja Karuppu) కూడా నిమగ్నమైవున్నారు. తనకు తెలిసినవారి ద్వారా వధువు వివరాలను సేకరిస్తున్నారు. కేకేనగర్‌లో కవింజ్ఞర్‌ కిచన్‌ పేరుతో జయంకొండన్‌ రెస్టారెంట్‌ నడుపుతున్నారు. ఈ రెస్టారెంట్‌కు రెగ్యులర్‌ కస్టమర్లు హీరో విజయ్‌ ఆంటోని, నటులు పార్తిబన్‌, గంజాకరుప్పు, అప్పుకుట్టి, మనీష్ కాంత్, బరోటా సూరి, కాళి వెంకట్‌ ఉన్నారు. వీరంతా కలిసి జయంకొండన్‌ ఓ ఇంటివాడిని చేసేందుకు చర్యలు చేపట్టారు.

*Saranya: సీనియర్ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు


Ganja.jpg

ఇందులో భాగంగా, వధువును చూసే బాధ్యతను గంజాకరుప్పు స్వీకరించారు. మంచి వధువు తారసపడితే ఆమె జయంకొండన్‌ వివాహం చేయించేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. ఇదిలావుండగా గంజాకరుప్పు కూడా ఊరపాక్కంలో ‘కవింజ్ఞర్‌ కిచెన్‌’ పేరుతో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించి దాని నిర్వహణ బాధ్యతలను కూడా జయంకొండన్‌కే అప్పగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జయంకొండన్‌ కోసం వధువును అన్వేషించే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు. అన్నీ కుదిరితే.. త్వరలోనే జయంకొండన్‌ పెళ్లి వార్త వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా... గంజాకరుప్పు, జయకొండన్‌లు మంచి స్నేహితులని, వారిద్దరి మధ్య స్నేహం 20 సంవత్సరాల నుండి కొనసాగుతోంది. (Kollywood Actor Ganja Karuppu)


ఇవి కూడా చదవండి:

====================

*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు

***********************

*Siddu Jonnalagadda: మెగాస్టార్‌ చిరుతో మూవీ ఛాన్స్ వచ్చింది కానీ..

************************

Updated Date - Apr 03 , 2024 | 01:39 PM