Saranya: సీనియర్ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:27 PM

సీనియర్‌ నటి శరణ్య పొన్‌వణ్ణన్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాహన పార్కింగ్‌ స్థల వివాదంలో శరణ్య తనను దుర్భాషలాడుతూ హత్య చేస్తానని బెదిరించారంటూ ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు వర్గాలను పిలిచి విచారిస్తున్నారు. అలాగే సీసీ కెమెరా ఫుటేజీలను కూడా విశ్లేషిస్తున్నారు.

Saranya: సీనియర్ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు
Saranya Ponvannan

సీనియర్‌ నటి శరణ్య పొన్‌వణ్ణన్‌ (Actress Saranya Ponvannan)పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు (Police Complaint) చేసింది. వాహన పార్కింగ్‌ స్థల వివాదంలో శరణ్య తనను దుర్భాషలాడుతూ హత్య చేస్తానని బెదిరించారంటూ ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు వర్గాలను పిలిచి విచారిస్తున్నారు. అలాగే సీసీ కెమెరా ఫుటేజీలను కూడా విశ్లేషిస్తున్నారు. సీనియర్‌ నటిగా ఉన్న శరణ్య... సినీ దర్శకుడు పొన్‌వణ్ణన్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు విరుగంబాక్కంలో ఉంటున్నారు.

అయితే, పార్కింగ్‌ (Parking) స్థలం విషయంలో శరణ్యకు పొరుగింటి మహిళ శ్రీదేవి (Sridevi)కి మధ్య చిన్నపాటి గొడవ ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం మరోమారు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో పరస్పరం ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. చివరకు పొరుగింటి మహిళ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా తనను బెదిరించినట్టుగా నిర్దారించే సీసీ కెమెరా ఫుటేజీలను సమర్పించింది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. (Senior Actress Saranya Ponvannan)


Saranya-POnvannan.jpg

సీనియర్‌ నటి శరణ్య (Saranya).. తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. టాలీవుడ్‌లో ఆమె పలు చిత్రాలలో నటించారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కొమరం పులి’ చిత్రంలో ఆమె మదర్ రోల్‌లో నటించారు. ‘మనం, బ్రహ్మోత్సవం, నానిస్ గ్యాంగ్ లీడర్, మహాసముద్రం’ వంటి చిత్రాలలో శరణ్య మోహన్ నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత నటిగా గుర్తింపును పొందారు. ఇప్పుడామె ఇలా పార్కింగ్ విషయంలో గొడవకు దిగడంతో.. తమిళ నాటే కాకుండా.. తెలుగు స్టేట్స్‌లోనూ శరణ్య వార్తలలో నిలుస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Siddu Jonnalagadda: మెగాస్టార్‌ చిరుతో మూవీ ఛాన్స్ వచ్చింది కానీ..

************************

*Alaya F: ఈ ఆటను లాంగ్‌లైఫ్‌ కొనసాగించాలనుకుంటున్నా..

************************

*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..

***********************

Updated Date - Apr 02 , 2024 | 01:27 PM