Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు

ABN , Publish Date - Apr 02 , 2024 | 03:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో వలంటీర్లను వైసీపీ ఎలా వాడుతుందో ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సజ్జల రామకృష్ణా రెడ్డికి పెన్షన్ల గురించి మాట్లాడే హక్కు లేదని.. దానిపై ఎలక్షన్ కమీషన్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు
Producer Natti Kumar

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో వలంటీర్ల (Volunteers) వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తమ స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ (Producer Natti Kumar) ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో..

‘‘ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో వలంటీర్లను నియమించినప్పటికీ, అంతర్లీనంగా తమ పబ్బం గడుపుకునేందుకు వారిని ఉపయోగించడం ఎంతమాత్రం సమంజసం కాదు. ప్రస్తుతం విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎం.ఎల్.ఎ. అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) ఆ మధ్య దసరా పండుగకు వలంటీర్ల చేత ఇంటింటికీ స్వీట్లు పంపిణీ చేయించారు. ప్రస్తుత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు కాస్త ముందస్తుగా ఆయన వేసిన ఎరగా అందరూ దీనిని భావిస్తున్నారు. ఒకవేళ వలంటీర్ల చేత తాను ఇంటింటికీ స్వీట్లు పంచలేదని ఆయన ఖండిస్తే, నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు ఉన్నాయి. పైన చెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే.

మొన్నటికి మొన్న ఇచ్ఛాపురం, కంచర్లలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడం, ఆ పార్టీ కండువాలు కప్పుకోవడం వంటి అంశాలు ఎలక్షన్ కమీషన్ నిబంధనలకు వ్యతిరేకం. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలలో మాత్రమే పాలుపంచుకోవాల్సిన వలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. వలంటీర్లు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యహరించాలని అనుకుంటే, తమ ఉద్యోగాలకు రిజైన్ చేసి కార్యకర్తలుగా మారిపోతే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న వలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతిలో పావులుగా మారకూడదు’’ అని నట్టి కుమార్ (Natti Kumar) అన్నారు.


Natti-Kumar.jpg

సజ్జలకు ఏం రైట్ ఉంది

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) 3వ తేదీన పెన్షన్లు ఇస్తామని ఏ హోదాతో చెబుతున్నారో ఎలక్షన్ కమీషన్ (EC) గమనించాలని నిర్మాత నట్టి కుమార్ వెల్లడించారు. ‘చీఫ్ సెక్రటరీ చూసుకోవాల్సిన అంశాలను ఏ రైట్‌తో సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని ప్రకటించారో తేలాలి. ఆపద్ధర్మ ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. దీనిపై కేసు రిజిస్టర్ చేసి, ఎలక్షన్ కమీషన్ తగిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Saranya: సీనియర్ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు

***************************

*Siddu Jonnalagadda: మెగాస్టార్‌ చిరుతో మూవీ ఛాన్స్ వచ్చింది కానీ..

************************

*Alaya F: ఈ ఆటను లాంగ్‌లైఫ్‌ కొనసాగించాలనుకుంటున్నా..

************************

Updated Date - Apr 02 , 2024 | 03:36 PM