Siddu Jonnalagadda: మెగాస్టార్‌ చిరుతో మూవీ ఛాన్స్ వచ్చింది కానీ..

ABN , Publish Date - Mar 31 , 2024 | 02:38 PM

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక పాత్ర చేసేందుకు ‘డిజె టిల్లు’ అదే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకు అవకాశం రాగా.. ఆయన ‘నో’ చెప్పినట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు సిద్ధు ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ ఈ విషయంపై స్పందించారు.

Siddu Jonnalagadda: మెగాస్టార్‌ చిరుతో మూవీ ఛాన్స్ వచ్చింది కానీ..
Chiranjeevi and Siddu Jonnalagadda

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమాలో ఒక పాత్ర చేసేందుకు ‘డిజె టిల్లు’ (DJ Tillu) అదే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)కు అవకాశం రాగా.. ఆయన ‘నో’ చెప్పినట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు సిద్ధు ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ ఈ విషయంపై స్పందించారు. చిరంజీవి(Chiranjeevi)తో సినిమా చేస్తే.. అది తన జీవితంలో ఒక మైల్‌స్టోన్‌ ఫిల్మ్‌గా మిగిలిపోవాలని.. అలాంటి అవకాశం మళ్లీ వస్తుందని తను భావిస్తున్నట్లుగా తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..

‘‘నాకు విక్టరీ వెంకటేష్‌ (Venkatesh)గారు ఆల్‌టైమ్ ఫేవరెట్‌. నాపై ఆయన ప్రభావం చాలా ఉంది. నాకు అమితాబ్‌ (Amitabh)గారు, చిరంజీవిగారు, రజనీకాంత్‌ (Rajinikanth)గారు, బాలకృష్ణ (Balakrishna)గారు- ఇలా అందరితోనూ కలిసి పని చేయాలని ఉంది. నేను చిరంజీవిగారు కలిసి ఒక సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మేము ఎప్పుడైనా కలిస్తే ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. చిరంజీవిగారు ఒక సూపర్‌ హ్యుమన్‌. తెలుగు ఇండస్ట్రీ అంటే మొదటగా గుర్తుకొచ్చేది ఆయన పేరే!


siddhu.jpg

మా చిన్నప్పడు.. చిరంజీవిగారు, బాలకృష్ణ గారు ఆకాశంలో తారల్లా కనిపించేవారు. అలాంటి తారలతో కలిసి నటించే అవకాశం వస్తే - అది బెస్ట్‌ ప్రాజెక్ట్‌ (Best Project) అవ్వాలి. అవుటాఫ్‌ వరల్డ్‌ ఉండాలి. నా పిల్లలకు- ‘నేను చిరంజీవిగారితో పనిచేశాను’ అని గర్వంగా చెప్పుకోవాలి. అది నా జీవితంలో ఒక మైల్‌స్టోన్‌గా మిగిలిపోతుంది. దేవుడి దయ ఉంటే ఏదో ఒక రోజు నాకు ఆ అవకాశం వస్తుంది. ఎవరో ఒక డైరక్టర్‌ ఒక కథ చెప్పి, అది ఆయనకు నచ్చి, ఆయన అంగీకరించే రోజు వస్తుంది. ఆయన స్టార్‌డమ్‌కి తగినట్లు తీయటం అంత సులభమైన విషయం కాదు. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా!’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Alaya F: ఈ ఆటను లాంగ్‌లైఫ్‌ కొనసాగించాలనుకుంటున్నా..

************************

*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..

***********************

Updated Date - Mar 31 , 2024 | 02:38 PM