25 ఏళ్ల తర్వాత రెహ్మాన్‌, ప్రభుదేవా కాంబో రిపీట్‌

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:41 PM

ఏ.ఆర్‌.రెహ్మాన్‌, ప్రభుదేవా 25 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయనున్నారు. వీరిద్దరు చిత్రపరిశ్రమకు దాదాపు ఒకే సమయంలో పరిచయమై అంచలంచెలుగా ఎదిగారు. ఆస్కార్‌ అవార్డు విజేతగా, సంగీత ప్రపంచంలో రారాజుగా ఏ.ఆర్‌.రెహ్మాన్‌ వెలుగొందుతుండగా.. ప్రభుదేవా నృత్య దర్శకుడిగా, నటుడిగా, హీరోగా, దర్శకుడిగా రాణిస్తున్నారు.

25 ఏళ్ల తర్వాత రెహ్మాన్‌, ప్రభుదేవా కాంబో రిపీట్‌
Prabhu Deva and AR Rahman

ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (AR Rahman), ప్రభుదేవా (Prabhu Deva) 25 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయనున్నారు. వీరిద్దరు చిత్రపరిశ్రమకు దాదాపు ఒకే సమయంలో పరిచయమై అంచలంచెలుగా ఎదిగారు. ఆస్కార్‌ అవార్డు విజేతగా, సంగీత ప్రపంచంలో రారాజుగా ఏ.ఆర్‌.రెహ్మాన్‌ వెలుగొందుతుండగా.. ప్రభుదేవా నృత్య దర్శకుడిగా, నటుడిగా, హీరోగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రభుదేవా హీరోగా నటించిన ‘కాదలన్‌’, ‘లవ్‌బర్డ్స్‌’, ‘మిస్టర్‌ రోమియో’, ‘మిన్సార కణవు’ వంటి చిత్రాలకు ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీత స్వరాలు అందించగా, ఈ చిత్రాల్లోని పాటలు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక్క చిత్రం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్‌ కానుంది. (Movie in AR Rahman and Prabhu Deva Combo)


rahman.jpg

పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కనున్న చిత్రంలో ప్రభుదేవా, యోగిబాబు, అజువర్గీస్‌, అర్జున్‌అశోకన్‌, మొట్టై రాజేంద్రన్‌ తదితరులు నటించనున్నారు. బిహైండ్‌ ఉడ్స్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీతం రెహ్మాన్‌ అందించనున్నారు. దీంతో 25 ఏళ్ల తర్వాత ఈ కాంబోలో సినిమా రాబోతోందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. మనోజ్‌ ఎన్‌ఎస్, దివ్య మనోజ్‌, డాక్టర్‌ ప్రవీణ్‌ ఎలక్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి దర్శకత్వం ఎన్‌.ఎస్. మనోజ్‌ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్ర వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: ‘అదే రక్తం.. అదే పౌరుషం’ డైలాగ్‌ని మార్చిన చిరు..

**************************

*Bade Miyan Chote Miyan: ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

*******************************

*Manchu Vishnu: చిరుకి పద్మ విభూషణ్, అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్, జై బాలయ్య.. ‘నవతిహి’ విశేషాలివే!

******************************

*Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..

************************

Updated Date - Mar 23 , 2024 | 09:41 PM