Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..

ABN , Publish Date - Mar 21 , 2024 | 01:51 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. ‘పుష్ప’ సినిమాతో ప్రపంచం మొత్తానికి తెలిసిన ఈ ఐకాన్ స్టార్.. అదే సినిమాతో టాలీవుడ్‌కు ఉత్తమ నటుడి కేటగిరీలో ఇప్పటి వరకు రాని నేషనల్ అవార్డ్‌ను సాధించి పెట్టి.. రికార్డ్ క్రియేట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే.. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ చాలానే రికార్డులు క్రియేట్ చేశారు. తాజాగా ఇన్‌స్టా ఫాలోయర్స్ విషయంలో బన్నీ తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేశారు.

Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..
Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ప్రపంచం మొత్తానికి తెలిసిన ఈ ఐకాన్ స్టార్.. అదే సినిమాతో టాలీవుడ్‌కు ఉత్తమ నటుడి (Best Actor) కేటగిరీలో ఇప్పటి వరకు రాని నేషనల్ అవార్డ్‌ను సాధించి పెట్టి.. రికార్డ్ క్రియేట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే.. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ (Allu Arjun) చాలానే రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టి.. మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ బద్దలుకొట్టిన రికార్డ్ ఏంటో తెలుసా? ఇన్‌స్టాగ్రమ్ ఫాలోయర్స్ (Instagram Followers).

సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రమ్‌లో బన్నీని ఫాలో అయ్యేవారి సంఖ్య 25 మిలియన్స్‌కు చేరింది. సౌత్‌లో ఇప్పటి వరకు ఏ హీరోకి ఈ రికార్డ్ లేదు. సౌత్‌లో అత్యధిక ఇన్‌స్టా ఫాలోయర్స్ ఉన్న హీరోగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటూ.. ఈ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ రికార్డ్‌తో అల్లు అర్జున్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతున్నారు. (Allu Arjun Creates Record with Insta Followers)


Bunny.jpg

తనను ఫాలో అయ్యేవారి సంఖ్య 25 మిలియన్లకు చేరుకున్న సందర్భంగా.. అల్లు అర్జున్ కూడా ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘25 మిలియన్స్.. ఎప్పటికీ కృతజ్ఞతలతో.. థ్యాంక్యూ..’ (25M. Thank You. Grateful Forever) అని పోస్ట్ చేయగా.. దీనికి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ‘వెల్‌డన్ లెజెండ్’ అంటూ కామెంట్ చేశారు. విశేషం ఏమిటంటే.. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్‌కు 1.5 మిలియన్స్ లైక్స్ రావడం. మొత్తంగా అయితే.. అల్లు అర్జున్ ఈ ఇన్‌స్టా ఘనతతో మరోసారి వార్తలలో వైరల్ అవుతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Thalakona: కశ్మీర్ యాపిల్‌‌లా ఉండే అప్సరా రాణి.. కశ్మీర్ మిర్చి‌లా..

*********************

*Earthquake: జపాన్‌లో భూకంపం.. 28వ అంతస్తులో రాజమౌళి ఫ్యామిలీ..!

***********************

*Suriya: ఈ యేడాది విడుదలకానున్న సూర్య రెండు చిత్రాలు

***************************

Updated Date - Mar 21 , 2024 | 01:51 PM