Bade Miyan Chote Miyan: ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Mar 23 , 2024 | 06:02 PM

పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘బడే మియా చోటే మియా’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అదిరిపోయే పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్‌ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Bade Miyan Chote Miyan: ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..
Bade Miyan Chote Miyan Movie Still

పూజా ఎంటర్‌టైన్‌మెంట్ (Pooja Entertainment) సంస్థ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అదిరిపోయే పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్‌ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఈ చిత్రం అల్టిమేట్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా రాబోతోంది. ‘బడే మియా చోటే మియా’ చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. (Bade Miyan Chote Miyan Trailer Release Date)

ఈ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌తో పాటు హీరోయిన్లు మానుషీ చిల్లర్ (Manushi Chhillar), ఆలయ ఫార్ట్యూన్ వాలా (Alaya F) యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫార్మెన్స్, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ‘బడే మియా చోటే మియా’.. ఇద్దరూ మీ హృదయాల్ని కొల్లగొట్టడమే కాదు.. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే మూమెంట్స్‌తో సిద్ధమవుతున్నారని.. ఇది కేవలం చిత్రం కాదు.. రోలర్ కోస్టర్ రైడ్ లాగా థ్రిల్లింగ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ అందించే విజువల్ వండర్‌‌లా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులను క్యాలెండర్‌లో డేట్ నోట్ చేసుపెట్టుకోమని సలహా ఇస్తుండటం విశేషం. (Bade Miyan Chote Miyan Update)


Tiger-Shroff.jpg

వశు భగ్నానీ, పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిలిమ్స్ సంస్థ.. ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థ అసోసియేషన్‌లో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్, ఆలయ‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Manchu Vishnu: చిరుకి పద్మ విభూషణ్, అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్, జై బాలయ్య.. ‘నవతిహి’ విశేషాలివే!

******************************

*Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..

************************

*Thalakona: కశ్మీర్ యాపిల్‌‌లా ఉండే అప్సరా రాణి.. కశ్మీర్ మిర్చి‌లా..

*********************

Updated Date - Mar 23 , 2024 | 06:02 PM