Sapthami Gowda: 'కాంతారా'లో పల్లెటూరి అమ్మాయిగా వేసిన ఈ అమ్మాయిని చూశారా

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:01 PM

'కాంతారా' సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా, తరువాత ఫారెస్ట్ గార్డుగా నటించిన సప్తమి గౌడ అందరికీ గుర్తుండే వుంటారు కదా. ఆమె ఇప్పుడు తాజాగా కొన్ని గ్లామర్ ఫోటోలు సామజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. \

Sapthami Gowda: 'కాంతారా'లో పల్లెటూరి అమ్మాయిగా వేసిన ఈ అమ్మాయిని చూశారా
Sapthami Gowda

కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, కథానాయకుడిగా నటించిన 'కాంతారా' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక్క కన్నడంలోనే కాకుండా, ఆ సినిమా తెలుగుతో పాటు, మిగతా భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ అనే ఆమె కథానాయకురాలిగా నటించింది.

saptamigowdaa.jpg

రిషబ్ శెట్టి తో పాటు, సప్తమి గౌడకి కూడా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో. ఒక పల్లెటూరి అమ్మాయిగా, తరువాత ఫారెస్ట్ గార్డు గా సెలక్టు అయి, తన ఊరి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చినప్పుడు, ఎటువంటి భావోద్వేగాలు ఉంటాయి, అవన్నీ చక్కగా చేసి చూపించింది సప్తమి గౌడ.

saptamigowdab.jpg

ఆ సినిమాలో రిషబ్ శెట్టికి జోడీగా నటించిన సప్తమి గౌడకి అది రెండో సినిమా. అంతకుముందు ఆమె 'పాప్ కార్న్ మంకీ టైగర్' అనే సినిమా మాత్రం చేసింది. రెండో సినిమా అయినా ఎంతో అనుభవం వున్న నటిలా చాలా చక్కని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సప్తమి గౌడ.

saptamigowdac.jpg

'కాంతారా' తరువాత సప్తమి గౌడ 'వాక్సిన్ వార్' అనే సినిమాలో నటించింది. ఇది దక్షిణాది భాషలతో పాటు, హిందీలో కూడా నిర్మించారు, అక్కడ కూడా విడుదల చేశారు. ఇది ఒక వైద్య వృత్తికి సంబందించిన సినిమా. ఇందులో కోవిడ్ వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి నివారణ కోసం శాత్రవేత్తలు ఎలా వ్యాధిని కనిపెట్టారు, వారికి కలిగిన అవరోధాలు, ఇంకా అటువంటి విషయాలతో ఈ సినిమా నిర్మించారు. వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాకి దర్శకుడు.


saptamigowdae.jpg

ఈ సంవత్సరం ఆమె సినిమా 'యువ' కూడా విడుదలైంది. మార్చి 29న విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. 'కేజీఎఫ్' , 'సలార్' లాంటి సినిమాలు నిర్మాణం చేసిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాకి నిర్మాతలు కావటం విశేషం. ఈ సినిమాకి విమర్శకుల దగ్గరనుండి మంచి ప్రశంశలు వచ్చాయి. ఇది ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది.

saptamigowdaf.jpg

సప్తమి గౌడ సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో చాలా చురుకుగా ఉంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలను తీసుకుంటూ అభిమానులకి వాటిని షేర్ చేస్తూ ఉంటుంది. ఈమధ్యనే బెంగుళూరులో వర్షం పడుతుంటే అటు ఇటు తిరుగుతున్నాను అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది సప్తమి గౌడ.

saptamigowdaj.jpg

Updated Date - Jun 05 , 2024 | 01:01 PM