Baak OTT Update: సైలెంట్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన.. రూ.100 కోట్ల హ‌ర్ర‌ర్ సినిమా

ABN , Publish Date - Jun 21 , 2024 | 08:05 AM

త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా న‌టించిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ బాక్ ఎట్ట‌కేల‌కు ఓటీటీకి వ‌చ్చేసింది. ప‌దిహేను రోజుల క్రిత‌మే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రావాల్సిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో ఎవ‌రూ ఊహించ‌ని విజ‌యం సాధించ‌డంతో కాస్త ఆల‌స్యంగా ఓటీటీకి వ‌చ్చింది.

Baak OTT Update: సైలెంట్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన.. రూ.100 కోట్ల హ‌ర్ర‌ర్ సినిమా
baak

గ‌త నెల‌లో చిన్న సినిమాగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన హ‌ర్ర‌ర్ చిత్రం బాక్ ఆర‌ణ్మై 4 (Aranmanai 4) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. సుంద‌ర్.సి మెయిన్ లీడ్‌గా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమాలో అగ్ర క‌థానాయిక‌లు త‌మ‌న్నా (Tamannaah Bhatia), రాశిఖ‌న్నా (Raashii Khanna) ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. మే 3న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టడ‌మే కాక ఈ ఏడు త‌మిళ సినిమా హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. తెలుగులో బాక్ (Baak) గా విడుద‌లైన ఈ మూవీ ఇక్క‌డా మంచి స్పంద‌న‌నే రాబ‌ట్టుకుంది.

Baak.jpg

అయితే ఈ సిరీస్‌లో వ‌చ్చిన అర‌ణ్మై( క‌ళావ‌తి, చంద్ర‌క‌ళ‌, అంత‌పురం) మూడు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ ఈ నాలుగో చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో తేర‌కెక్కించారు. క‌థ‌ విష‌యానికి వ‌స్తే.. శివ‌శంక‌ర్ ,శివాని అన్నాచెల్లెల్లు. శివాని ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా త‌ను ప్రేమించిన ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అనుకోకుండా ప‌ది సంవ‌త్స‌రాల త‌ర్వాత చెల్లి శివాని అత్మ‌హ‌త్య చేసుకుంద‌ని, ఆమె భ‌ర్త అనుమానాస్ప‌దంగా చ‌నిపోయాడ‌ని శివ‌శంక‌ర్‌కు వార్త తెలుస్తుంది. దీంతో అక్క‌డ ఏం జ‌రిగిందో తెలుసుకోవ‌డానికి శివ‌శంక‌ర్ ఆ ఊరికి వెళ‌తాడు. తీరా అక్క‌డికి వెళ్లాక శివాని కూతురు అప‌స్మార‌క స్థితితో ఉండ‌డం, అక్క‌డ వింత వింత ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అతీంద్రీయ శ‌క్తులు అక్క‌డి వారిని భ‌య‌బ్రాంతుకు గురి చేస్తుంటాయి.


baak.jpeg

అదే స‌మ‌యంలో త‌న చెల్లి మ‌ర‌ణం గురించి శివ‌శంక‌ర్ ఎంక్వైరీ చేస్తున్న క్ర‌మంలో కొత్త విష‌యాలు బ‌య‌ట ప‌డ‌తాయి. బాక్ ఎవ‌రు, చెల్లి మ‌ర‌ణానికి దానికి సంబంధం, పిల్ల‌ల‌ను ర‌క్షించుకోవ‌డానికి శివాని ఒంట‌రిగా చేసిన పోరాటం ఎమోష‌న‌ల్‌గా సాగుతూ ఫ్యామిలీ ఆడియొన్స్‌ను కంట‌త‌డి పెట్టిస్తాయి. చివ‌ర‌కి బాక్‌ని ఎలా మ‌ట్టుబెట్టార‌నే అస‌క్తిక‌ర‌మైరన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ చూసే ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్‌ను అందిస్తుంది. న‌వ్వులు పూయించ‌డంలో ఈ సినిమా విఫ‌ల‌మ‌యినా భ‌య పెట్ట‌డంలో మాత్రం స‌క్సెస్ అయింది. విజువ‌ల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా క్ష‌ణాల్లో ఆకారం మార్చుకునే ద‌య్యంగా బాక్ క‌ట్టి ప‌డేస్తుంది.

tamannaahbaak.jpg

ఇప్పుడీ సినిమా (జూన్ 21) శుక్ర‌వారం నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌ (Disney+ Hotstar) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, హ‌ర్ర‌ర్ సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ సినీమా చూడ‌డం మిస్ చేయ‌కండి. సినిమా అయిపోయాక వ‌చ్చే పాట‌లో శృతిమించిన ఎక్స్‌ఫోజింగ్ మిన‌హ సినిమా అంతా కుటంబంతో క‌లిసి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. డోంట్ మిస్‌.సినిమా అయిపోయాక పాట‌ను వ‌దిలేస్తే చాలు.

Updated Date - Jun 21 , 2024 | 08:05 AM