Aarambham OTT: ప‌ది రోజుల్లోనే.. ఓటీటీలోకి వ‌చ్చేసిన తెలుగు సైంటిఫిక్ థ్రిల్ల‌ర్! డోంట్ మిస్

ABN , Publish Date - May 21 , 2024 | 05:05 PM

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన‌, డిఫ‌రెంట్ జాన‌ర్ చిత్రం వ‌చ్చేసింది. ప్ర‌ముఖ క‌న్న‌డ న‌వ‌ల అధారంగా తెర‌కెక్కిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఆరంభం సినిమా మే10 న థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకుంది.

Aarambham OTT: ప‌ది రోజుల్లోనే.. ఓటీటీలోకి వ‌చ్చేసిన తెలుగు సైంటిఫిక్ థ్రిల్ల‌ర్! డోంట్ మిస్
aarambham

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన‌, డిఫ‌రెంట్ జాన‌ర్ చిత్రం వ‌చ్చేసింది. ఇటీవ‌లే మే10 న థియేట‌ర్ల‌లో విడుద‌లైన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఆరంభం (Aarambham). మొద‌టి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎల‌క్ష‌న్స్‌, ఐపీఎల్ వ‌ళ్ల పూర్తిగా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక పోయింది. ఇప్పుడీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ప్ర‌ముఖ క‌న్న‌డ న‌వ‌ల అధారంగా తెర‌కెక్కిన ఈ ఆరంభం సినిమాకు అజ‌య్‌నాగ్ (Ajay Nag) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేరాఫ్ కంచ‌ర‌పాలెం చిత్రం ఫేం మోహ‌న్ భ‌గ‌త్ (Mohan Bhagat) ఈ సినిమాలో హీరోగా న‌టించ‌గా భూష‌ణ్‌, అభిషేక్‌, ర‌వీంద్ర‌ విజ‌య్ (Ravindra Vijay), సుప్రీత‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సింజిత్ ఎర్ర‌మిల్లి (SinjithYerramilli) సంగీతం అందించారు.

తెలుగులో ఎప్పుడో అమాస పున్నానికోసారి అరుదుగా వ‌చ్చే టైమ్ ట్రావెల్‌, టైమ్ లూప్ క‌థాంశంతో వ‌చ్చిన ఈ ఆరంభం (Aarambham) చిత్రం అసాంతం ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్‌ను ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. మిగిల్ (మోహ‌న్ భ‌గ‌త్) ఓ హ‌త్య కేసులో ఉరిశిక్ష ప‌డి జైలుకు వెళ‌తాడు. తెల్లారితే ఉరి తీస్తార‌నే స‌మ‌యానికి మిగిల్ (మోహ‌న్ భ‌గ‌త్) జైలు నుంచి త‌ప్పించుకుంటాడు. అయితే అత‌ను ఉన్న గ‌దికి వేసిన తాళాలు వేసిన‌ట్టే ఉండ‌డం, గోడ‌ దూకి వెళ్లిన‌ట్లు, అధికారులు, ఖైదీలు చూసిన అన‌వాళ్లు ఏవీ కూడా లేక‌పోవ‌డంతో ఈ కేసు మిస్ట‌రీగా మారుతుంది.

aarambham.jpg


దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేష‌న్‌ను డిటెక్టివ్ ర‌వీంద్ర విజ‌య్‌కు అప్ప చెబుతారు. ఈ క్ర‌మంలో జైలులో మిగిల్ డైరీ దొర‌క‌డంతో పాటు, తోటి ఖైదీ సాయంతో విస్తూపోయే నిజాలు తెలుసుకుంటాడు. అవేంటి.. హీరో కాలంలో ఎందుకు వెన‌క్కి వెళ్లాల్సి వ‌చ్చింది.. ఓ ప్రోపెస‌ర్ చేసిన ఈ ప్ర‌యోగంలో ఎందుకు పాల్గొని ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు, చివ‌ర‌కు హీరో ఎమ‌య్యాడ‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంటుంది.

GOCpti2bYAALt8R.jpeg

కాకపోతే టైమ్ లూప్ కాన్సెప్ట్ కావ‌డంతో చూసిన స‌న్నివేశాల‌నే చూసిన‌ట్లు అనిపించి కాస్త క‌న్ప్యూజ‌న్ ఉంటుంది. అది త‌ప్పితే సినిమా అంతా ఎమోష‌న‌ల్, థ్రిల్ల‌ర్‌గా సాగుతూ ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా మే 23 గురువారం నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఈ టీవి విన్ (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది.. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు త‌ప్ప‌కుండా ఇప్పుడు ఆరంభం (Aarambham) చిత్రాన్ని ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్‌.

Updated Date - May 23 , 2024 | 08:26 AM