Sriranga Neethulu: బ‌స్తీ నుంచి బంగళాలో వుండే వారందరికీ క‌నెక్ట్ అయ్యే క‌థ

ABN , Publish Date - Mar 29 , 2024 | 10:39 PM

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌తార‌లుగా నటించిన చిత్రం ‘శ్రీ‌రంగనీతులు’. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 11న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Sriranga Neethulu: బ‌స్తీ నుంచి బంగళాలో వుండే వారందరికీ క‌నెక్ట్ అయ్యే క‌థ
Sriranga Neethulu Trailer Launch Event

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘శ్రీ‌రంగనీతులు’ (Sriranga Neethulu). ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేయనున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ వేడుకను మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో అజ‌య్ అర‌సాడ‌, శ‌శాంక్‌, వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి, రుహాని శ‌ర్మ‌, ప్ర‌వీణ్‌కుమార్, విరాజ్ అశ్విన్‌, కార్తీక్ రత్నం, సుహాస్, కిర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. (Sriranga Neethulu Trailer Released)

ఈ సంద‌ర్బంగా నిర్మాత వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి మాట్లాడుతూ.. ఏప్రిల్ 11న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నాం. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కుమార్ నా స్నేహితుడు. తనే అన్ని విభాగాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు. సినిమా అంతా బాగా వచ్చింది. చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నానని తెలపగా.. సంగీత ద‌ర్శ‌కుడు అజ‌య్ అర‌సాడ మాట్లాడుతూ.. శ్రీ‌రంగ‌నీతులు చిత్రం క్లోజ్ టు మై హార్ట్‌. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నానని అన్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ అవ‌కాశం ఇచ్చి స‌పోర్ట్ చేసిన నిర్మాత‌కు థ్యాంక్స్‌. త‌ప్ప‌కుండా ఇది అంద‌రికి న‌చ్చే సినిమా.. అంద‌రూ క‌నెక్ట్ అవుతారని తెలిపారు. (Sriranga Neethulu Movie)


Ruhani.jpg

కార్తీక్ ర‌త్నం (Karthik Ratnam) మాట్లాడుతూ.. నాకు న‌చ్చిన పాత్ర‌ను ఇందులో చేశాను. నాకు న‌చ్చిన ఆర్టిస్టుల‌తో ప‌నిచేశాను. సినిమా చాలా బాగుంది. అంద‌రూ థియేటర్‌లో త‌ప్ప‌కుండా చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరగా.. హీరోయిన్ రుహాని శ‌ర్మ (Ruhani Sharma) మాట్లాడుతూ.. చాలా రోజులుగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచి సినిమాలో నేను న‌టించినందుకు హ్య‌పీగా వుంది. ఇది అంద‌రి క‌థ. అన్ని పాత్ర‌ల‌తో అంద‌రూ క‌నెక్ట్ అవుతారు. సినిమా చూస్తున్న‌ప్పుడు చాలా మంది వాళ్ల‌ను వాళ్లు అద్దంలో చూసుకుంటున్న‌ట్లుగా ఉంటుంది. ఎంతో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్‌. ఇలాంటి సినిమాల‌ను స‌పోర్ట్ చేస్తే మ‌రిన్ని మంచి సినిమాలు వ‌స్తాయని.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.

విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మాట్లాడుతూ.. ఈ సినిమాకు క‌థే హీరో. ప్ర‌వీణ్ మంచి ద‌ర్శ‌కుడే కాదు పాటు మంచి ర‌చ‌యిత‌ కూడా. చాలా మంచి క‌థ‌. ఇందులో నేను న‌టించినందుకు ఆనందంగా వుంది. ఇందులో విభిన్న పాత్ర‌లు ఉంటాయి. బ‌స్తీ నుంచి బంగళాలో వుండే వారందరికీ క‌నెక్ట్ అయ్యే క‌థ ఇదని తెలిపారు. సుహాస్ (Suhas) మాట్లాడుతూ మాట్లాడుతూ.. ప్ర‌వీణ్ చాలా క‌ష్ట‌ప‌డి చేశాడు. త‌న జ‌ర్నీ నాకు తెలుసు. ఇదొక ఆంథాల‌జీ సినిమా. మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. అంద‌రూ మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తార‌ని అనుకుంటున్నాను. నిర్మాత ఎంతో అభిరుచి గల వ్య‌క్తి. మంచి సినిమాను నిర్మించాడని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Anupama Parameswaran: ఆనందంలో మాటలు రావడంలేదు

************************

*VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్..

***********************

*Manchu Manoj: రామ్ చరణ్‌కి అర్థరాత్రి కాల్ చేశా.. క్షణంలో రూ. 5 లక్షలు పంపాడు

*****************************

Updated Date - Mar 29 , 2024 | 10:39 PM