Sri Ranga Neethulu: విన‌రా విన‌రా చెబుతా విన‌రా ‘శ్రీ‌రంగ‌నీతులు’..

ABN , Publish Date - Feb 17 , 2024 | 07:33 PM

‘శ్రీ‌రంగ‌నీతులు’.. ఈ టైటిల్ తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయమే. యూత్‌కి కావాల్సిన ఎమోషన్స్.. సహజత్వం నిండిన సన్నివేశాలతో వచ్చే సినిమాలకు ఈ మధ్య ఎటువంటి ఆదరణ ఉంటుందో.. బాక్సాఫీస్ తెలియజేస్తూనే ఉంది. అలాంటి సినిమానే ఈ ‘శ్రీరంగనీతులు’. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా నుంచి ‘విన‌రా విన‌రా చెబుతా విన‌రా ఈ కాలం శ్రీ‌రంగ‌నీతులు’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది.

Sri Ranga Neethulu: విన‌రా విన‌రా చెబుతా విన‌రా ‘శ్రీ‌రంగ‌నీతులు’..
Sri Ranga Neethulu Movie Stills

‘శ్రీ‌రంగ‌నీతులు’.. ఈ టైటిల్ తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయమే. యూత్‌కి కావాల్సిన ఎమోషన్స్.. సహజత్వం నిండిన సన్నివేశాలతో వచ్చే సినిమాలకు ఈ మధ్య ఎటువంటి ఆదరణ ఉంటుందో.. బాక్సాఫీస్ తెలియజేస్తూనే ఉంది. అలాంటి సినిమానే ఈ ‘శ్రీరంగనీతులు’ (Sri Ranga Neethulu). ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా నుంచి ‘విన‌రా విన‌రా చెబుతా విన‌రా ఈ కాలం శ్రీ‌రంగ‌నీతులు’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌కు అజ‌య్ అర‌సాడ స్వరాలు సమకూర్చారు.

వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌మ‌కంటూ ఓ గుర్తింపును క్రియేట్ చేసుకున్న సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌తార‌లుగా నటించిన ఈ చిత్రానికి ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది. (Sri Ranga Neethulu Title Song Launched)


SRN.jpg

ఈ పాట విడుదల సంద‌ర్భంగా ద‌ర్శ‌కనిర్మాతలు మాట్లాడుతూ.. ఈత‌రం యువ‌త ఆలోచ‌న‌ల‌ను, ఎమోష‌న్స్‌ ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ చిత్రంలో వుండే పాత్రల ద్వారా చూపిస్తున్నాం. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఉన్న ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాలు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే మ‌న‌సుకు హ‌త్తుకుంటాయి. కొత్త‌ద‌నంతో పాటు పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది

**************************

*Vijay Deverakonda: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..

****************************

Updated Date - Feb 17 , 2024 | 07:33 PM