BBN: రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్.. సక్సెస్‌పై నమ్మకంగా ఉన్న చిత్రయూనిట్..

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:00 PM

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ ట్రైలర్‌‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రాండ్‌గా విడుదల చేశారు. రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో.. సినిమా సక్సెస్‌పై మేకర్స్ నమ్మకంగా ఉన్నట్లుగా తెలిపారు.

BBN: రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్.. సక్సెస్‌పై నమ్మకంగా ఉన్న చిత్రయూనిట్..
Bhoothaddam Bhaskar Narayana Movie Team

శివ కందుకూరి (Shiva Kandukuri) హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana). స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ (Purushotham Raaj) దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ ట్రైలర్‌‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. భయాన్ని కలిగించే ఓ లాఫింగ్ ఎఫెక్ట్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో శివ క్యారెక్టర్‌ని బిగినింగ్‌లో ఓ ఫన్ నోట్‌లో ప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ కేసు తెరపైకి వచ్చిందో కథ ఉత్కంఠగా మారుతుంది. చెక్కతో చేసే దిష్టి బొమ్మలు, చనిపోయిన వారి డెడ్ బాడీలు తూర్పుకు వుండటం, సైకో సీరియల్ కిల్లర్ కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ .. ఇవన్నీ చాలా ఎంగేజింగా వున్నాయి. అలాగే శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్‌గా వుంది. తన పాత్ర కథలో లీనం చేసేలా వుంది. రాశి సింగ్ కేసుని ఫాలో చేసే జర్నలిస్ట్‌గా కనిపించింది. షఫీ, దేవిప్రసాద్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమాని చాలా గ్రిప్పింగ్‌గా తీశారనేది ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్‌లో వుంది. మొత్తానికి ఈ ప్రీ రిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత ఎక్జయిట్‌మెంట్‌ని పెంచేదిగా ఉంది. (Bhoothaddam Bhaskar Narayana Release Trailer Launched)


Raj-Kandukuri.jpg

ఈ ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రీ రిలీజ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా వుంది. సినిమా ప్రమోషన్స్‌ని చాలా యూనిక్ చేశాం. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం. మా సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడంతో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. గీతా డిస్ట్రిబ్యూషన్ వారు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ మాకు మరింత నమ్మకాన్ని పెంచింది. దర్శకుడు, నిర్మాతలకు, టీం అందరికీ థాంక్స్. మార్చి 1న సినిమా వస్తోంది. సక్సెస్ మీట్‌లో కలుద్దామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా.. సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Drugs Case: పోలీసు విచారణలో క్రిష్‌!.. రాడిసన్‌లోని జంట గదులపై ఫోకస్‌

*******************************

*Dil Raju: ‘లవ్ మీ’ కథ వినగానే.. ‘ఆర్య’కు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. అలా ఎగ్జైట్ అయ్యా..

**************************

*Ester Noronha: 10 సంవత్సరాల క్రితం మొదటి హిట్, అసలు విషయం చెప్పేసిన ఎస్తర్..

********************************

Updated Date - Feb 28 , 2024 | 12:00 PM