మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Save The Tigers 2: ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

ABN , Publish Date - Mar 02 , 2024 | 04:12 PM

‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ గతేడాది స్ట్రీమింగ్‌కు వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందింది. ఈ సిరీస్‌లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ సీజన్ 2‌ మార్చి 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Save The Tigers 2: ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..
Save The Tigers 2 Movie Still

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 (Save The Tigers 2) వచ్చేస్తోంది. ఫస్ట్ సీజన్ ‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers) మంచి ఆదరణను పొందడమే కాకుండా.. సెకండ్ సీజన్‌పై మంచి అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అంతేకాదు, సీజన్ 2 ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అనేది కూడా ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌ (Disney Plus Hotstar)లో ‘సేవ్ ద టైగర్స్ 2‘ స్ట్రీమింగ్ కాబోతోంది. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు.

ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా షో క్రియేటర్ మహీ వి రాఘవ్ (Mahi V Raghav) మాట్లాడుతూ.. సేవ్ ద టైగర్స్‌కు సెకండ్ సీజన్ అనౌన్స్ చేయడం థ్రిల్లింగ్‌గా ‌ఫీలవుతున్నాం. ‘సేవ్ ద టైగర్స్’ ఫస్ట్ సీజన్‌కు మించిన హ్యూమర్, సస్పెన్స్, ఫన్‌ను సీజన్ 2లో అందించబోతున్నామని అన్నారు. (Save The Tigers 2 Trailer Released)


Chaitanya-Krishna.jpg

‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ విషయానికి వస్తే (Save The Tigers 2 Trailer Talk).. ట్రైలర్ బిగినింగ్ నుంచే ఫన్ రైడింగ్‌గా ఉంటూ హిలేరియస్‌గా సాగింది. వైవాహిక జీవితంలో విసిగిపోయిన భర్తలుగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ మరోసారి తమ ఫ్రస్టేషన్‌తో నవ్వించారు. సంసారంలోని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు హ్యూమరస్‌గా ఉన్నాయి. భార్యలు కూడా తమ భర్తలకు బుద్ధి చెప్పే పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ..ఈ ముగ్గురు హంసలేఖ (Hamsalekha) మిస్సింగ్ కేసులో ఇరుక్కోవడంతో కథలో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ హంసలేఖ ఎవరు, ఆమెతో వీళ్లు చేసిన ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీసింది. ఆ కేసు నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు? అనే సీన్స్‌తో ‘సేవ్ ద టైగర్స్ 2‘ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.


ఇవి కూడా చదవండి:

====================

*Charan and Upasana: భార్య కాళ్లకు మసాజ్ చేస్తున్న రామ్ చరణ్.. వీడియో వైరల్

************************

*Tarak and Charan: రామ్-భీమ్ కలిసి ఒకే కారులో.. వీడియో వైరల్

********************

*Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. ఏంటి కథ?

**************************

Updated Date - Mar 02 , 2024 | 04:12 PM