మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Charan and Upasana: భార్య కాళ్లకు మసాజ్ చేస్తున్న రామ్ చరణ్.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 02 , 2024 | 01:59 PM

అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అని అంటుంటారు మన పెద్దలు. అలాగే ఎంతటి గ్లోబల్ స్టార్ హీరో అయినా ఓ భార్యకు భర్తే కదా.. అని ఈ వీడియో చూసిన వారంతా అనుకోకుండా ఉండలేరు. తాజాగా మెగా కోడలు ఉపాసన కాళ్లకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మసాజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ఈ సామెతనే గుర్తు చేసుకుంటున్నారు.

Charan and Upasana: భార్య కాళ్లకు మసాజ్ చేస్తున్న రామ్ చరణ్.. వీడియో వైరల్
Upasana and Ram Charan

అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అని అంటుంటారు మన పెద్దలు. అలాగే ఎంతటి గ్లోబల్ స్టార్ హీరో అయినా ఓ భార్యకు భర్తే కదా.. అని ఈ వీడియో చూసిన వారంతా అనుకోకుండా ఉండలేరు. తాజాగా మెగా కోడలు ఉపాసన (Upasana) కాళ్లకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మసాజ్ (Massage) చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ఈ సామెతనే గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అంబానీ ఇంట పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో రామ్ చరణ్, ఉపాసనలతో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. అంతకు ముందు ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఎన్టీఆర్‌ (Jr NTR) దంపతులతో కలిసి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు చరణ్ దంపతులు. ఎన్టీఆర్ దంపతులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరు కాగా, చరణ్ దంపతులు ఇలా అంబానీ ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ (#AmbaniPreWedding)లో సందడి చేశారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో చరణ్‌తో కలిసి ఉపాసన వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే.. తాజాగా ఈ మసాజ్ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. (Ram Charan Massages wife Upasana Tired Feet)


Upsi.jpg

ఉపాసన ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో అలసిపోయిన ఉపాసనకు చరణ్ ఇలా మసాజ్ చేస్తూ కనిపించారు. చరణ్ మసాజ్ చేస్తుంటే.. ఉపాసన హాయిగా నిద్రపోతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా భార్య పట్ల రామ్ చరణ్ (Ram Charan) చూపిస్తున్న కేరింగ్ చూసి వావ్ అంటున్నారు. ఎంతటి స్టార్ అయినా భార్య కాళ్లు పట్టాల్సిందే అంటూ కొంతమంది సరదాగా కామెంట్స్ వేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. (Ram Charan and Upasana Viral Video)


ఇవి కూడా చదవండి:

====================

*Tarak and Charan: రామ్-భీమ్ కలిసి ఒకే కారులో.. వీడియో వైరల్

********************

*Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. ఏంటి కథ?

**************************

*Tamannaah: ‘ఓదెల 2’ లో..

********************************

Updated Date - Mar 02 , 2024 | 05:52 PM