Tarak and Charan: రామ్-భీమ్ కలిసి ఒకే కారులో.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 02 , 2024 | 12:11 PM

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్-తారక్.. ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం స్పష్టంగా రివీలైంది. అప్పటి వరకు వారిని బద్ద శత్రువులుగా భావించిన వారిలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. చరణ్ గురించి తారక్, తారక్ గురించి చరణ్.. ఈ ప్రమోషన్స్‌లో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వారిద్దరూ ఒకే కారులో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు.

Tarak and Charan: రామ్-భీమ్ కలిసి ఒకే కారులో.. వీడియో వైరల్
Tarak and Charan at Airport

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) కొమరం భీమ్‌గా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో.. అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్-తారక్ (Ram Charan and Tarak).. ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం స్పష్టంగా రివీలైంది. అప్పటి వరకు వారిని బద్ద శత్రువులుగా భావించిన వారిలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. చరణ్ గురించి తారక్, తారక్ గురించి చరణ్.. ఈ ప్రమోషన్స్‌లో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వారిద్దరూ ఒకే కారులో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు.

తారక్, చరణ్ ఇద్దరూ వారి ఫ్యామిలీలతో కలిసి వేరు వేరు ఫంక్షన్స్‌కి హాజరయ్యే నిమిత్తం.. ఇద్దరూ కలిసి ఒకే కారులో ఎయిర్‌పోర్ట్‌కి రావడం విశేషంగా మారింది. రామ్ చరణ్, ఉపాసన (Ram Charan and Upasana) దంపతులు ముకేశ్ అంబానీ తనయుడు వివాహానికి హాజరయ్యే నిమిత్తం ముంబై.. తారక్, లక్ష్మీ ప్రణతి (Jr NTR and Lakshmi Pranathi) దంపతులు బెంగళూర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు పయనమయ్యారు. ప్రస్తుతం వారు గమ్యస్థలాలకు చేరుకున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఈవెంట్స్ వెళ్లే నిమిత్తం.. చరణ్, తారక్ ఇద్దరూ ఒకే కారులో నుంచి దిగి ఎయిర్ పోర్ట్‌కు వెళుతున్న వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. మరోసారి ఇద్దరూ వారి మధ్య ఉన్న బాండింగ్‌ని తెలియజేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Charan.jpg

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana)తో ఓ సినిమా కమిటయ్యారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ (Devara) అనే సినిమా, బాలీవుడ్‌లో ‘వార్ 2’ (War 2) సినిమాలు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా కమిటై ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. ఏంటి కథ?

**************************

*Tamannaah: ‘ఓదెల 2’ లో..

********************************

*Rashmika Mandanna: టోక్యో ఎయిర్ పోర్ట్‌లో రష్మికకు సర్‌ప్రైజింగ్ వెల్కమ్

*******************************

Updated Date - Mar 02 , 2024 | 12:11 PM