హ్యాట్రిక్ సక్సెస్.. సుహాస్ ఎమోషనల్ లెటర్

ABN , Publish Date - Feb 09 , 2024 | 11:48 PM

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న సుహాస్.. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ లెటర్‌ను షేర్ చేశారు. తనని ప్రేమతో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరో హ్యాట్రిక్ సినిమాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చెబుతూ.. అందరికీ ఈ లేఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

హ్యాట్రిక్ సక్సెస్.. సుహాస్ ఎమోషనల్ లెటర్
Hero Suhas

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న సుహాస్.. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ లెటర్‌ను షేర్ చేశారు. తనని ప్రేమతో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరో హ్యాట్రిక్ సినిమాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చెబుతూ.. అందరికీ ఈ లేఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. సుహాస్ పోస్ట్ చేసిన లేఖలో ఏముందంటే..

Suhas-Letter.jpg

‘‘అందరికీ నమస్కారం

అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాని మేము అనుకున్నట్లుగానే ప్రేమతో ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌కి కామెంట్స్‌ పెట్టడం దగ్గర నుంచి ఇప్పుడు ‘బుక్‌ మై షో’లో టికెట్స్‌ కొనే వరకు.. నన్ను దగ్గరికి తీస్కోని ప్రేమతో నడిపిస్తూనే ఉన్నారు. మీ యొక్క ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేనిది..

నటుడిగా నా పరిధిలో నేను చేయగలిగినంత వరకు, నా స్థాయిలో కథలను ఎంచుకుని మీ ముందుకు తీసుకురావడమే నా ఈ చిన్న ప్రయత్నం. కలర్‌ ఫొటో, రైటర్‌ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. వాటికి ఉదాహరణలు.

వచ్చే నెలల్లో నేను కథానాయకుడిగా మీ ముందుకి ‘ప్రసన్న వదనం’, దిల్‌ రాజు గారు నిర్మాతగా సందీప్‌ రెడ్డి బండ్ల ప్రాజెక్ట్ (ఇంకా పేరు పెట్టలేదు), మరియు ‘కేబుల్ రెడ్డి’ సినిమాలతో.. మీరు థియేటర్ కి వచ్చి హాయిగా నవ్వుకొని ఆస్వాదించే ఇంకొక మూడు మంచి సినిమాలతో మీ ముందుకి రాబోతున్నాను.

హ్యాట్రిక్ ఇచ్చినందుకు థాంక్స్.

మరొక హ్యాట్రిక్ ఇస్తారు అని నా ప్రయత్నం నేను చేస్తూనే, మీ ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

-మీ సుహాస్’’ అని సుహాస్ తన లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Feb 09 , 2024 | 11:48 PM