Bhimaa: ఓటీటీలోకి వచ్చేసిన ‘భీమా’.. ఇక్కడైనా..!!

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:13 PM

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘భీమా’. మహాశివరాత్రి స్పెషల్‌గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌నే రాబట్టుకుంది. ఈ సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Bhimaa: ఓటీటీలోకి వచ్చేసిన ‘భీమా’.. ఇక్కడైనా..!!
Gopichand in Bhimaa

మ్యాచో హీరో గోపీచంద్ (Macho Hero Gopichand) హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘భీమా’ (Bhimaa). మహాశివరాత్రి స్పెషల్‌గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌నే రాబట్టుకుంది. ఈ సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌ (Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ (Hero Gopichand) ఓ వీడియోను విడుదల చేసి.. అందులో ప్రేక్షకుల్ని ‘భీమా’ చూడాల్సిందిగా కోరారు. ‘మ్యాజిక్ ఆఫ్ భీమా మీ స్క్రీన్స్ మీదకు వచ్చేసింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. మీరంతా తప్పక చూడండి’ అని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

*Superstar Krishna: కృష్ణగారిని పవన్ కళ్యాణ్ విమర్శించటం షాక్ కి గురి చేసింది: నరేష్


మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘భీమా’ బెస్ట్ ఆప్షన్ అనేలా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌ ప్రమోట్ చేస్తోంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ (Sri Sathya Sai Arts) బ్యానర్‌లో నిర్మాత కెకె రాధా‌మోహన్ (KK Radha Mohan) నిర్మించారు. దర్శకుడు ఎ హర్ష (A Harsha) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియ భవానీ శంకర్ (Priya Bhavani Shankar), మాళవిక శర్మ (Malvika Sharma) హీరోయిన్లుగా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్‌లోకి వచ్చింది. ప్రస్తుతం డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమా మంచి స్పందనను రాబట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.


Gopichand.jpg

ఈ సినిమా కథ (Bhimaa Movie Story) విషయానికి వస్తే.. మహేంద్రగిరి పట్టణానికి భీమా (గోపీచంద్) పోలీసు అధికారిగా వస్తాడు. అతను రావటంతోనే అదే ఊరిలో వున్న భవాని (ముఖేష్ తివారి) అనే రౌడీని, అతని అనుచరులను కొట్టి తాను వచ్చింది వాళ్ళ అంతు చూడటానికే అని చెప్తాడు. అదే ఊరిలో టీచర్‌గా పని చేస్తున్న విద్య (మాళవిక శర్మ)తో ప్రేమలో పడతాడు. విద్య ఒక వైపు టీచర్‌గా పనిచేస్తూనే.. మరో వైపు ఆ వూర్లో ప్రజలకి తన ప్రకృతి వైద్యంతో జబ్బులు నయం చేస్తున్న రవీంద్ర వర్మ (నాజర్) దగ్గర రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. భవాని అక్రమంగా లారీలో రవాణా చేస్తున్న పిల్లలని భీమా రక్షించి ఒక సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నంలో భవానీ మనుషులతో పోరాటం అవుతుంది. ఆ పోరాటంలో భవానీ మనుషులు భీమాపై విషప్రయోగం చేసి అతన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు. అదే వూర్లో వున్న పరమశివుడి గుడిలో ఎవరైనా చంపబడితే దశదిన కర్మలోపు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క రక్త సంబంధీకులు వచ్చి పిలిస్తే చనిపోయిన వారి ఆత్మ ఆ వ్యక్తిని ఆవహిస్తుంది. అలాంటి గుడి కొన్ని సంవత్సరాలుగా మూతబడి ఉంటుంది. ఎందుకు ఆ గుడి మూతబడి వుంది? సముద్రంలో పడిన భీమా పరిస్థితి ఏంటి? రవీంద్ర వర్మ ఆయుర్వేద వైద్యంతో పాటు ఇంకేమైనా చేస్తూ ఉంటాడా? భీమా ఆ గుడి తలుపులు తీయించగలిగాడా? భవానీ వెనకాల ఇంకెవరైనా వుండి నడిపిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ ‘భీమా’ సినిమా. (Bhimaa in Disney Plus Hotstar)

Updated Date - Apr 25 , 2024 | 02:13 PM