Superstar Krishna: కృష్ణగారిని పవన్ కళ్యాణ్ విమర్శించటం షాక్ కి గురి చేసింది: నరేష్

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:05 AM

కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ ప్రసంగంలో ఎన్టీఆర్ పేరు, కృష్ణ పేరు వాడారు. అందులో కృష్ణ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల విజయనిర్మల కుమారుడు నరేష్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. కృష్ణగారిపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు చూసి షాక్ కి గురయ్యాను అని చెప్పారు నరేష్.

Superstar Krishna: కృష్ణగారిని పవన్ కళ్యాణ్ విమర్శించటం షాక్ కి గురి చేసింది: నరేష్
Krishna, Naresh, Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ పేరుని తన రాజకీయ ప్రసంగంలో ప్రస్తావించారు. తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నందమూరి తారకరామారావు గారితో ఏరోజు మిగతా సినిమా హీరోలు ఎవరూ సహకరించలేదు అని చెప్పారు పవన్ కళ్యాణ్. కొంతమంది కాంగ్రెస్ లో వున్నారు, కృష్ణ గారు కాంగ్రెస్ లో వున్నారు, కోట శ్రీనివాస్ గారు వేరే పార్టీలో వున్నారు, ఎన్టీఆర్ గారిని విమర్శించే వాళ్ళు, కానీ ఏరోజు ఎన్.టి. రామారావుగారు కృష్ణగారిని ఒక్కమాట కూడా అనలేదు, అది ఎన్టీఆర్ సంస్కారం అని చెప్పారు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో. పక్కన ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా వున్నారు.

Mega Brothers

అయితే పవన్ కళ్యాణ్ ఇలా కృష్ణ గురించి మాట్లాడిన మాటలు విని షాక్ అయ్యాను అని సీనియర్ నటుడు, విజయనిర్మల కుమారుడు అయిన నరేష్ తన సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా చెప్పారు. అతను ఒక పోస్ట్ పెడుతూ కృష్ణ గారు బంగారు హృదయం గల మనిషని, సినిమా, రాజకీయాలలో అయన చేసిన కృషి మరువలేనిదని చెప్పారు నరేష్. అయితే అటువంటి కృష్ణ గారిపై పవన్ కళ్యాణ్ ఇలా విమర్శించడం విని షాకయ్యను అని నరేష్ చెప్పారు.

ఎన్టీఆర్ సంస్కారం వుంది అందువలనే, అతనిపై విమర్శలు చేసిన మిగతా సినిమా నటులపై తిగిరి విమర్శించలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం వీడియో, నరేష్ తన 'ఎక్స్' లో షేర్ చేస్తూ, కృష్ణ గారు ఎన్టీఆర్ గురించి మాట్లడిన వీడియోని కూడా షేర్ చేశారు నరేష్. అందులో కృష్ణ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ని చూడటానికే అప్పట్లో మద్రాస్ వెళ్లానని, అతన్ని కలిశానని, అతని సినిమాలో వేషం ఇవ్వమని అడిగితే 'నువ్వు ఇంకా చిన్న కుర్రాడిలా వున్నావు' తరువాత రా అని చెప్పారని కృష్ణ గారు ఆ వీడియోలో ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

vknareshfilmjourney.jpg

నరేష్ కృష్ణ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ కృష్ణ గారు ఎప్పుడూ తన పొత్తులు మార్చుకోలేదు, అలాగే ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు అని నరేష్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకి గౌరవం ఉందని, అతనికి ఆంధ్ర ప్రదేశ్ లో మంచి భవిష్యత్తు ఉందని, కానీ భవిష్యత్తులో ఇటువంటి మాటలు కృష్ణ గారి గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది అని అతనికి విజ్ఞపి చేస్తున్నాను, అని నరేష్ చెప్పారు.

Updated Date - Apr 25 , 2024 | 11:05 AM