LSD: ఎల్ఎస్‌డి వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?

ABN , Publish Date - Jan 31 , 2024 | 09:43 PM

అనిల్ మోదుగ, శివ కోన నిర్మాణంలో శివ కోన దర్శకత్వంలో వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఎల్ఎస్‌డి. ప్రాచీ టక్కర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్, కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నటించిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఈ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

LSD: ఎల్ఎస్‌డి వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?
LSD web Series Still

అనిల్ మోదుగ, శివ కోన నిర్మాణంలో శివ కోన దర్శకత్వంలో వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఎల్ఎస్‌డి. ప్రాచీ టక్కర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్, కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నటించిన ఈ సిరీస్‌కు ప్రవీణ్ మణి, శశాంక్ తిరుపతి సంగీతం అందించారు. పవన్ గుంటుకు, హర్ష ఈడిగ సినిమాటోగ్రాఫర్స్‌గా వర్క్ చేశారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ తెలుగు, హిందీ భాషల్లో ఏకకాకంలో ఫిబ్రవరి 2న ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ వెబ్ సీరీస్ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. (LSD Web Series Trailer)


RRR.jpg

సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో డార్క్ కామెడీ‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ వెబ్ సిరీస్‌లో అన్ని ఇరుక్కు అంటూ ఆగమాగం చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ను ఈ సిరీస్‌లో జోడించినట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, వారి ఫారెస్ట్‌ ట్రిప్‌ ఎల్ఎస్‌డి వెబ్ సిరీస్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తూనే.. దర్శకుడు శివ కోన ఎంటర్‌టైనింగ్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. కచ్చితంగా ఈ సిరీస్ మంచి ఆదరణను పొందుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Nandi Awards: నంది అవార్డ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

***************************

*Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..

******************************

*Dheera: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి హిట్టవుతుంది

****************************

*Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?

**************************

Updated Date - Jan 31 , 2024 | 09:43 PM