మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి భేటీ

ABN, Publish Date - Mar 28 , 2024 | 01:03 PM

చిత్ర పరిశ్రమలో ఆదర్శ మిత్రులు, అగ్రశ్రేణి దర్శక నిర్మాతలుగా పేరు పొందిన ఎస్వీ కృష్ణారెడ్డి- అచ్చిరెడ్డి.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనా దక్షత అభినందనీయంగా ఉందని.. అదే విషయాన్ని వారి వద్ద ప్రస్తావించి శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఈ భేటీపై నిర్మాత అచ్చిరెడ్డి చెప్పుకొచ్చారు.

SV Krishna Reddy and K Atchi Reddy Meets CM Revanth Reddy

చిత్ర పరిశ్రమలో ఆదర్శ మిత్రులు, అగ్రశ్రేణి దర్శక నిర్మాతలుగా పేరు పొందిన ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy)- అచ్చిరెడ్డి (Atchi Reddy) ద్వయానికి రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోయినప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరితో అనుబంధం ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ రాజకీయ వేదికలపై కనిపించలేదు. అయితే ఇటీవల వీరిద్దరూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy)ని కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో భేటీపై నిర్మాత అచ్చిరెడ్డి స్పందిస్తూ.. ‘‘అది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే. రేవంత్ రెడ్డిగారు మాకు చిరకాల పరిచయస్తులు. అలాగే వారి అల్లుడుగారి తరఫున దూరపు బంధుత్వం కూడా ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత శుభాకాంక్షలు తెలపడం కోసం టైం తీసుకుని గత ఆదివారం రోజున ఆయనని కలిశాం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని కేటాయించి మాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనా దక్షత అభినందనీయంగా ఉంది. అదే విషయాన్ని వారి వద్ద ప్రస్తావించి శుభాకాంక్షలు చెప్పాము’’ అని తెలిపారు. (SV Krishna Reddy and Atchi Reddy Meets CM Revanth Reddy)


ఇవి కూడా చదవండి:

====================

*Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్..

***************************

*Anasuya: నాకు పార్టీ కాదు.. లీడర్ ముఖ్యం.. పవన్ కళ్యాణ్‌ పిలిస్తే ప్రచారం చేస్తా!

************************

*Siddhu Jonnalagadda: అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు..

*****************************

*Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?

Updated Date - Mar 28 , 2024 | 01:06 PM