Alaya F: ఈ ఆటను లాంగ్‌లైఫ్‌ కొనసాగించాలనుకుంటున్నా..

ABN , Publish Date - Mar 31 , 2024 | 11:11 AM

ఈ ముంబై భామ పేరు అలయా ఫర్నిచర్‌వాలా. బాలీవుడ్‌ నటి పూజా బేడీ కూతురు ఈమె. బ్రాండ్‌ అంబాసిడర్‌గానే కాకుండా నటిగానూ ప్రూవ్‌ చేసుకుంటోంది ఈ అమ్మడు. త్వరలో ఆమె నటించిన ‘బడే మియా చోటే మియా’ విడుదలవుతున్న సందర్భంగా అలయా.. తన గురించి కొన్ని ఆసక్తి విషయాలను చెప్పుకొచ్చింది.

Alaya F: ఈ ఆటను లాంగ్‌లైఫ్‌ కొనసాగించాలనుకుంటున్నా..

ఈ ముంబై భామ పేరు అలయా ఫర్నిచర్‌వాలా (Alaya Farnicharwala). బాలీవుడ్‌ నటి పూజా బేడీ (Pooja Bedi) కూతురు ఈమె. బ్రాండ్‌ అంబాసిడర్‌గానే కాకుండా నటిగానూ ప్రూవ్‌ చేసుకుంటోంది ఈ అమ్మడు. త్వరలో ఆమె నటించిన ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan) విడుదలవుతున్న సందర్భంగా అలయా.. తన గురించి కొన్ని ఆసక్తి విషయాలను చెప్పుకొచ్చింది.

‘‘ఏదైనా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటా. ఇంకొకరి మీద ఆధారపడను. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో అనే విషయం పట్టించుకోను. ఆఖరికి మా అమ్మ సలహా కూడా నా కెరీర్‌ విషయంలో వినను. ఎందుకంటే మా అమ్మ సినిమాలకు దూరమై చాలా కాలమైంది. నాక్కూడా సినిమాలతో అసోషియేషన్‌ సంవత్సరాల పాటు లేదు. అందుకే మా ఫ్యామిలీకి నా కెరీర్‌ కొత్తే. నా సొంత నిర్ణయం తీసుకోవటం వల్ల ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. అందుకే స్ర్కిప్టుల విషయంలో నాదే కీలక నిర్ణయం’’ అంటుంది అలయా. (Alaya F Interview)

ఇదీ నేపథ్యం

అలయా.. తన ఇన్‌స్టాలో జస్ట్‌ ఎ రియల్లీ లక్కీ గాళ్‌ అని ప్రొఫైల్‌లో రాసుకుంది. అలా రాసుకోవటానికి కారణమేంటో తెలీదు కానీ.. ఆమె నిజంగా లక్కీ గాళే. ఎందుకంటే కరోనా లాక్‌డౌన్‌కు కాస్త ముందు రిలీజ్‌ అయింది. ఆ చిత్రమే.. ‘జవానీ జానేమన్‌’. తొలి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్‌ బెస్ట్‌ డెబ్యుడెంట్‌ నటిగా అవార్డు దక్కించుకుంది. ‘నటిగా నన్ను జనాలు గుర్తించిన వేళ ఆ ఆనందం మరువలేను’ అంటుంది అలయా. 2022 సంవత్సరంలో ‘ఫ్రెడ్డీ’ అనే చిత్రంలో నటించింది. ఆ సమయంలో వచ్చినా.. గుర్తింపు వచ్చిందని అలయా సంతోషంగా ఫీలవుతుందట. ఇకపోతే.. తన తల్లి పార్శీ మూలాలున్న వ్యక్తి. తన తండ్రి పేరు ఫర్హాన్‌ ఇబ్రహీం ఫర్నిచర్‌వాలా. అలయా.. నటుడు కబీర్‌ బేడీ మనమరాలు కూడా. సినిమా నేపథ్యముంది కాబట్టి.. ఆమె బాలీవుడ్‌ జనాలతో మూవ్‌ కావటం కొత్తగా ఫీల్‌ కాలేదు.

Alaya-4.jpg

ఆ విషయం తెలుసు

‘నటిగా నాకు ఫ్లయింగ్‌ మూమెంట్స్‌. అయితే ఇక్కడ ఇంటిపేరు చెబితే కుదరదు. కష్టపడాలి. ప్రేక్షకుల మెప్పు పొందాలి. ఈ ప్రొఫెషన్‌ శాశ్వతం కాదు. ఏదీ అంచనా వేయలేం. ఎక్కువ రోజులూ పరిగెత్తలేం. దీంతో పాటు భయమూ లేదు. కరోనా సమయంలో నా స్టాఫ్‌కు జీతాలు ఇవ్వటానికే ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత నాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. కారు, ఆ తర్వాత కొత్త ఇల్లు.. అన్నీ దక్కాయి. మా అమ్మ ఇండిపెండెంట్‌గా ఉంటుంది. నాకది నేర్పింది. కష్టాల్లో ఆ ధైర్యమే నిలబెట్టింది. ఇపుడు జీవితాన్ని పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ చేసుకుంటున్నా’నంటుంది అలయా. (Bollywood Actress Alaya F)


alaya-2.jpg

ఈ గేమ్‌ ఆపను

‘నాకో బలహీనత ఉంది.. సోషల్‌ మీడియా పోస్టులను కంట్రోల్‌ చేసుకోలేను. జనాలతో టచ్‌లో ఉంటా.. నా అప్‌డేట్స్‌ చెబుతున్నా కదా అనుకుంటా. నా గురించి పదిమంది జనాలు మాట్లాడుకోవటం ఇష్టం. ఇంతకంటే గొప్ప సాధనం కనిపించదు. పర్సనల్‌ లైఫ్‌, వ్యాయామం, సినిమా విశేషాలను.. సోషల్‌ మీడియా (Social Media)లో షేర్‌ చేస్తుంటా. నిత్యం ప్రేక్షకులతో టచ్‌లో ఉండటమే నా ధ్యేయం. ఈ గేమ్‌ లాంగ్‌లైఫ్‌ కొనసాగించాలనుకుంటాను. ఎందుకంటే నేను పోస్ట్‌ చేసిన ప్రతి ఫొటోను జనాలు ఇష్టపడుతున్నారు’ అంటూ సంబరపడిపోతుంది అలయా.

Alaya-1.jpg

వేగం నచ్చదు

‘యు టర్న్‌’ (U-Turn) చిత్రం డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. అతి త్వరలో నేను నటించిన ‘బడే మియా చోటా మియా’ విడుదలవుతోంది. ప్రస్తుతం ‘శ్రీకాంత్‌’ అనే డిఫరెంట్‌ కథలో నటిస్తున్నా. అవకాశాలు వస్తున్నాయి. అయితే వేగంగా అందుకోవాలన్న ఆతృత లేదు. ఎందుకంటే మంచి కథలను ఎంచుకుంటే.. ఆ పాత్రలే నన్ను నిలబెడతాయి అనే విషయం తెలుసు. మంచి నటిగా ప్రూవ్‌ చేసుకోవాలన్నదే నా లక్ష్యం.

alaya-3.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..

***********************

*Adiparvam: ప్రచార చిత్రంతోనే ఫైర్ చూపించిన మంచు లక్ష్మీ

***********************

Updated Date - Mar 31 , 2024 | 11:11 AM