AP Elections 2024: వైసీపీపై నట్టికుమార్ సెన్సేషనల్ కామెంట్స్

ABN , Publish Date - May 08 , 2024 | 08:21 PM

‘సెంట్రల్ ఫోర్స్ లేకుంటే వైసీపీ అరాచకాలను భరించే పరిస్థితి లేదు. ఏపీలో కూటమి అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక ఉత్తరాంధ్ర ఏరియాలో ప్రత్యేకించి నేను తిరిగి మాట్లాడుతున్నాను. కూటమికి ప్రజల సపోర్ట్ కళ్లారా చూశాను. వైసీపీ రౌడీయిజాన్ని ఎన్నికల కమీషన్ అరికట్టాలి’ అని అన్నారు సీనియర్ నిర్మాత నట్టి కుమార్. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో జబర్దస్త్ ఫేమ్ ఆర్.పి.తో కలసి ఆయన మాట్లాడారు.

AP Elections 2024: వైసీపీపై నట్టికుమార్ సెన్సేషనల్ కామెంట్స్
Natti Kumar

‘సెంట్రల్ ఫోర్స్ లేకుంటే వైసీపీ అరాచకాలను భరించే పరిస్థితి లేదు. ఏపీలో కూటమి అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక ఉత్తరాంధ్ర ఏరియాలో ప్రత్యేకించి నేను తిరిగి మాట్లాడుతున్నాను. కూటమికి ప్రజల సపోర్ట్ కళ్లారా చూశాను. వైసీపీ రౌడీయిజాన్ని ఎన్నికల కమీషన్ అరికట్టాలి’ అని అన్నారు సీనియర్ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar). బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో జబర్దస్త్ ఫేమ్ ఆర్.పి.తో కలసి ఆయన మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర (Uttarandhra) ఎలక్షన్స్ బలాబలాలు గురించి చెప్పాలంటే... శ్రీకాకుళం‌లో 8 సీట్లు కూటమివే. వైజాగ్ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇక విజయనగరం జిల్లాలో పోటీ నువ్వా నేనా అనేలా ఉంది. జగన్ వల్లే స్టీల్ ఫ్యాక్టరీకి ఈ దుస్థితి వచ్చింది. వైసీపీకి చెందిన సిదిరి అప్పలరాజు, దువ్వాడ, ధర్మాన, తమ్మినేని తదితరులు అందరికీ ఓటమే. విశాఖలో భరత్ ఎంపీగా గెలవబోతున్నారు. ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ నాయకులు భూములు విపరీతంగా కబ్జా చేశారు.


Kutami.jpg

పవన్ (Pawan Kalyan) లక్షా పదివేల మెజారిటీతో గెలవబోతున్నారు. సినిమా వాళ్లు ముందుకు వచ్చి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయాలి. సినిమా వాళ్లు మాత్రం కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా కూటమి (Kutami)కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.. ఎందుకంటే రాబోయేది కూటమి ప్రభుత్వమే‌‌‌. జగన్ (Jagan) దుర్మార్గాలను చెళ్లిళ్లు షర్మీల, సునీతలు చెబుతున్నారు. విజయమ్మ (Vijayamma) జగన్ గురించి ఏమీ ఎందుకు మాట్లాడటం లేదో ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఏపీలో సిఎస్‌ను కూడా మార్చాల్సిన అవసరం ఉందని నట్టి చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - May 08 , 2024 | 08:21 PM