Natti Kumar: పవన్‌పై ముద్రగడ, ద్వారంపూడి చేసిన విమర్శలపై నట్టికుమార్ ఫైర్

ABN , First Publish Date - 2023-06-21T18:19:52+05:30 IST

రాజకీయంగా పవన్ కల్యాణ్‌పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం చేసిన విమర్శలపై.. తాజాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు చేయడం ద్వారంపూడికి తగదని అన్నారు. సినిమా పరిశ్రమలో దాదాపు 35 ఏళ్లుగా ఉన్న మాకు ఎవరు ఎలాంటివారో తెలుసని అన్నారు. కాపు ఉద్యమనేతగా పేరున్న ముద్రగడ.. మరో కాపుపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

Natti Kumar: పవన్‌పై ముద్రగడ, ద్వారంపూడి చేసిన విమర్శలపై నట్టికుమార్ ఫైర్
Natti kumar, Dwarampudi and Mudragada

ఏ పార్టీల వారైనా ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, అయితే వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి విమర్శలు చేయడం ఎవరికీ మంచిది కాదని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ (Natti Kumar) హితవు పలికారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..

Pawan-Kalyan.jpg

‘‘ఏ నాయకులు ఎక్కడికి మీటింగు‌లకు వెళ్లినా, అక్కడి లోకల్ సమస్యల గురించి మాట్లాడటం సహజం. దానిని బేస్ చేసుకుని కాకినాడలో పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ను బ్యానర్ కట్టనివ్వం. అడుగు పెట్టనివ్వం అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Dwarampudi Chandrasekhar Reddy) అనడం కరెక్ట్ కాదు. కాకినాడ ఆంధ్రప్రదేశ్‌లో ఉందా? ఇంకెక్కడైనా ఉందా? అని అనిపిస్తోంది. ద్వారంపూడి మాటలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)కి నష్టం చేసేలా ఉన్నాయి.

dwaram-pudi.jpg

అంతే కాదు పవన్ కల్యాణ్ డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు చేయడం కూడా ద్వారంపూడికి తగదు. సినిమా పరిశ్రమలో దాదాపు 35 ఏళ్లుగా ఉన్న మాకు ఎవరు ఎలాంటివారో తెలుసు. సాయం చేయడం తప్ప పవన్ కల్యాణ్‌కు అలాంటివి తెలియవు. ఎవరో ఏదో చెప్పారని ద్వారంపూడి ఆరోపించారా? లేక కావాలని ఆరోపించారో తెలియదు కానీ వాటిని ద్వారంపూడి నిరూపించాలి. పార్టీ పరంగా ఎన్ని విమర్శలైనా ఒకరినొకరు చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా పవన్‌ను అనడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఇక పవన్, ద్వారంపూడి మధ్య మాటల యుద్ధంలో ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఎందుకు ఎంటర్ అయ్యారో అర్ధం కావడం లేదు.

Mudragada.jpg

ముద్రగడ అనగానే 1991వ సంవత్సరం నుంచి ఒక కాపు (Kapu) ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితం. ఆయనను కాపు ఉద్యమ నేతగానే అందరూ చూస్తారు. అయితే ముద్రగడ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడితే ఫర్వాలేదు కానీ ఒక కాపు ఉద్యమ నేతగా పవన్‌ను విమర్శించడం ఎంతమాత్రం తగదు. మేము ముద్రగడను ఓ పెద్దమనిషిగా గౌరవిస్తాం. ఇది ఆయన తెలుసుకోవాలి. వాస్తవానికి కాపులను బీసీలలో చేర్చాలని 1991లో ముద్రగడ చేపట్టిన కాపు ఉద్యమంలో అప్పట్లో యువకుడిగా ఉన్న నేను కీలకంగా పాల్గొన్నాను. నాడు ఆయన చేపట్టిన ఉద్యమం మొదలు నేటి వరకు ఆయన చేపట్టిన ఉద్యమాలు ఏవీ సక్సెస్ కాలేదు. కాపులు ఎవరు ముఖ్యమంత్రి (CM) అయినా, ఏ పార్టీకి చెందిన వారైనా నేను స్వాగతిస్తాను.

ముద్రగడ ఓ కాపు నాయకుడు అయివుండి, పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతమాత్రం సబబు కాదు. దీనిపై ఇంకా లోతులలోకి వెళ్లదలచుకోలేదు. దీనిని ముద్రగడ విజ్ఞతకే వదిలి వేస్తున్నాను. అయినా పవన్ కల్యాణ్ తన మాటలలో తనను అన్ని కులాల వాళ్ళు అభిమానిస్తారు.. అందువల్ల తాను అందరివాడినని అంటున్నారు. 2009లో చిరంజీవి (Chiranjeevi)కి నష్టం కలిగించేలా కుల ప్రస్తావనను కొన్ని శక్తులు తీసుకుని వచ్చాయి. కొన్ని కారణాల వల్ల 2014లో పవన్ గెలవకపోయినా, ఇప్పడు అన్నింటినీ విశ్లేషించుకుని పవన్ ముందుకు వెళుతున్నారు..’’ అని పవన్ కల్యాణ్‌పై ముద్రగడ, ద్వారంపూడి చేసిన విమర్శలపై నట్టికుమార్ మాట్లాడారు.

Natti.jpg

విశాఖపట్నంలో చర్చి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారు

‘‘విశాఖపట్నం నడి బొడ్డున కోట్లాది రూపాయల సి.బి.ఎన్.సి చర్చి స్థలాన్ని ఆక్రమించుకుని మరీ అక్కడ బిజినెస్ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని 2021వ సంవత్సరంలోనే ఏపీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి పలువురికి లెటర్స్ రూపంలో ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా అధికారుల అండదండలతో స్థానిక ఎంపీ ఎం.వి.వి. (MVV) రెండువేల కోట్లతో కట్టబోతున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకుని చర్చి స్థలాన్ని చర్చికే అప్పగించాలి’’ అని నట్టి కుమార్ ఇదే ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Adipurush: డైరెక్టర్‌దే కాదు.. 50 శాతం ప్రభాస్ తప్పు కూడా ఉంది.. నటి సంచలన వ్యాఖ్యలు

**************************************

*Tiku Weds Sheru: 49 ఏళ్ల హీరో, 21 హీరోయిన్‌ల మధ్య కిస్సింగ్‌ సీన్‌.. రచ్చ రచ్చ అవుతోంది

**************************************

*Chiranjeevi: పాప పుట్టిన ఘ‌డియ‌లు చాలా మంచివి.. ఆ ప్రభావం కనిపిస్తుంది

**************************************

*Heroines: పెళ్లి ముహూర్తానికి వేళాయెరా..


**************************************

*Rakesh Master: గురువు రాకేశ్ మాస్టర్ భౌతికకాయం చూసి కన్నీరుమున్నీరైన శిష్యులు


**************************************

Updated Date - 2023-06-21T18:20:44+05:30 IST