Natti Kumar: వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క కాల్ రాలేదు.. చంద్రబాబు, పవన్‌లకు మద్దతు ఇవ్వగానే..?

ABN , First Publish Date - 2023-11-04T21:37:05+05:30 IST

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తూ.. ఆయనకు మొదటి నుండి సపోర్ట్‌గా ఉంటూ వస్తున్న నిర్మాత నట్టి కుమార్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసిన నట్టి కుమార్.. మరో వైపు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానివ్వనంటూ శపథం చేశారు.

Natti Kumar: వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క కాల్ రాలేదు.. చంద్రబాబు, పవన్‌లకు మద్దతు ఇవ్వగానే..?
Producer Natti Kumar

చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తూ.. ఆయనకు మొదటి నుండి సపోర్ట్‌గా ఉంటూ వస్తున్న నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసిన నట్టి కుమార్.. మరో వైపు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానివ్వనంటూ శపథం చేశారు. వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క కాల్ కూడా రాలేదు.. కానీ ఇప్పుడు నా ఆస్తులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలుసు. నా డబ్బులు నాకు వచ్చే వరకు వర్మ ‘వ్యూహం’ సినిమాని వదిలేదే లేదంటూ నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..

‘‘చంద్రబాబు నాయుడు‌గారి అక్రమ అరెస్ట్‌ను నేను ఖండించాను. వారికి కష్టకాలంలో సపోర్ట్ చేయటం జరిగింది. రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా విషయంలో గైడ్ లైన్స్‌ను గుర్తు చేశాను. ‘వ్యూహం’ సినిమాను రివైజింగ్ కమిటీకి సెన్సార్ సిఫార్సు చేసింది. రివైజింగ్ కమిటీ సభ్యురాలైన జీవిత‌గారిని దూరంగా ఉంచాలని కోరాను. అందుకు మా అనుమానాలను ప్రస్తావించటం జరిగింది. రివైజింగ్ కమిటీ‌కి ‘వ్యూహం’ స్క్రీనింగ్ పెట్టి క్యాన్సిల్ చేశారు. జీవిత (Jeevitha Rajasekhar)గారికి వ్యూహంపై ఎందుకంత అత్యుత్సాహం? దీనిపైనే మేము అభ్యంతరాలు తెలుపుతున్నాము.


ఆర్జీవి (RGV) నాకు డబ్బులు ఇవ్వాలి. అవి ఇవ్వకుంటే ఏ సినిమా రిలీజ్ కాకూడదు. గతంలో వారిచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయి.. కోర్టులో తెల్చుకుంటాం. ఈ విషయంపై నేను మాట్లాడుతుంటే వైసీపీ వారికి ఏంటి బాధ? రాత్రి కమీషనర్ ఆఫీస్ నుంచి కానిస్టేబుల్ ప్రసాద్ అని ఫోన్ చేశారు. నా ఆస్తుల వివరాలు అడిగారు‌‌.. చెప్పాను. నా‌ స్నేహితులకు కూడా నా ఆస్తుల వివరాలను అడిగారట‌‌‌. నేను ఇలాంటి వాటికి భయపడను. మీరు ఎంక్వెరీ చేసుకోండి.. ఇంకేమైనా చేసుకోండి.

అయినా చంద్రబాబుగారినే జైలులో పెట్టారు. నన్ను జైలుకు పంపటం మీకు పెద్ద విషయం కాదు. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే ‘వ్యూహం’ సినిమా విడుదల అవుతుంది. ఆర్జీవి చాలామందికి డబ్బులు ఇవ్వాలి. నాకు డబ్బులు ఇవ్వవద్దు అని వర్మకి జగన్ చెబుతారనుకోను. సోమవారం ‘వ్యూహం’ విషయంలో కోర్టును ఆశ్రయిస్తున్నాను. కోర్టులోనే తేల్చుకుంటాను.


Natti1.jpg

ఏపీ పోలీసు వారికి నా విన్నపం ఏమిటంటే.. నేను అరెస్ట్‌కు సిద్ధంగా ఉన్నా.. మీకు నా సహకారం ఉంటుంది. ప్రభుత్వ డబ్బులు వేస్ట్ చేసి మూడు, నాలుగు వ్యాన్‌లు వేసుకు రావద్దు. ఆర్టికల్ 19 ఆర్జీవికి, వైసీపీకే‌నా.. సామాన్యులకు ఉండదా‌‌? ఈ అరాచకం ఇంకొన్ని రోజులు మాత్రమే. నేను వైసీపీలో ఉన్నంత వరకు నాకు ఎలాంటి ఫోన్స్ రాలేదు మరి. నేనిప్పుడు సిబిఎన్ (CBN), పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)గారికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. నాకు ఎవరి సెక్యూరిటీ అవసరం లేదు. నేను కష్టపడి సంపాదించిన సొమ్ము ఆర్జీవి నుంచి వచ్చే వరకు ‘వ్యూహం’ సినిమా విడుదలను అడ్డుకుంటాను. నా ఆస్తుల ఎంక్వైరీ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు..’’ అంటూ నిర్మాత నట్టి కుమార్ (Producer Natti Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Hi Nanna: ‘అమ్మాడి’ పాటతో కట్టిపడేస్తోన్న అమ్మాడి..

**********************************

*Atharva: ఫస్ట్ టైమ్ క్లూస్ టీమ్‌పై సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్సయింది

**********************************

*Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’కు ‘జవాన్, బాహుబలి’ టచ్..

*************************************

*Karthi: ‘ఖైదీ’ ఎలా సర్‌ప్రైజ్ చేసిందో.. ‘జపాన్’ కూడా అంతే..

***************************************

Updated Date - 2023-11-04T21:38:36+05:30 IST