Mega Fans: గ్లోబల్ స్టార్ బర్త్‌డే.. సంబరాల్లో డల్లాస్ మెగా ఫ్యాన్స్

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:12 PM

RRR చిత్రంతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుని.. గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్‌కు ఈ బర్త్‌డే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. దీంతో మెగాభిమానులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల బృందం ప్లానో(డల్లాస్)లోని స్పైస్ రాక్ రెస్టారెంట్‌లో గ్రాండ్‌గా పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు.

Mega Fans: గ్లోబల్ స్టార్ బర్త్‌డే.. సంబరాల్లో డల్లాస్ మెగా ఫ్యాన్స్
Ram Charan Birthday Celebrations in USA

RRR చిత్రంతో రామ్ చరణ్ (Ram Charan) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుని.. గ్లోబల్ స్టార్‌గా మారారు. పాన్ ఇండియా స్టార్ హీరోల్లో రామ్ చరణ్ టాప్ లీగ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘గేమ్ చేంజర్’ (Game Changer) కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. దీంతో పాటు బుచ్చిబాబు (Buchibabu) దర్శకత్వంలో ఓ సినిమా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలోనూ ఓ సినిమాను రామ్ చరణ్ చేయబోతున్నారు. ఈ బర్త్‌డే రామ్ చరణ్‌కు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. దీంతో మెగాభిమానులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) అభిమానుల బృందం ప్లానో(డల్లాస్)లోని స్పైస్ రాక్ రెస్టారెంట్‌లో గ్రాండ్‌గా పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. (Global Star Ram Charan Birthday Celebrations)

‘‘మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్‌గా తనదైన ముద్ర వేశారు. ఆయన వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వారసత్వాన్ని కొనసాగించటం అంత సులభమైన విషయం కాదు. అయితే చరణ్ ఎంతో బాధ్యతతో తనపై ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ అగ్ర తారగా దూసుకెళ్తున్నారు. ‘రంగస్థలం, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాల్లో నటించి నటుడిగా తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తండ్రి బాటలోనే నడుస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ తరం యువ కథానాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు’’ అని రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు (Ramcharan Birthday Celebrations) హాజరైన అందరూ ఆయన ఎదుగుదలను ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.


USA.jpg

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చిట్టి ముత్యాల, ఏపీటీఏ మాజీ అధ్యక్షుడు నటరాజ్ యెల్లూరి, డల్లాస్ బాబీ మరియు రాజేష్ కళ్లేపల్లిలతో పాటు శ్రీరామ్ మత్తి, సురేశ్ లింగినేని, కిషోర్ అనిశెట్టి, కిషోర్ గుగ్గిలపు, నరసింహ సత్తి తదితరులు హాజరయ్యారు. వెల్నాటి, సునీల్ తోట, సుధాకర్ అందే ఆప్త, నాగేశ్వర్ చందన, రత్నాకర్ జొన్నకూటి, అనిల్ చలమలశెట్టి తదితరులు కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.

charan.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్..

***************************

*Anasuya: నాకు పార్టీ కాదు.. లీడర్ ముఖ్యం.. పవన్ కళ్యాణ్‌ పిలిస్తే ప్రచారం చేస్తా!

************************

*Siddhu Jonnalagadda: అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు..

*****************************

Updated Date - Mar 28 , 2024 | 03:15 PM