Pooja Hegde: నా అంచనా తారుమారైంది.. కానీ పేరొచ్చింది!

ABN , First Publish Date - 2023-04-15T16:52:59+05:30 IST

సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ గురించి టాలీవుడ్‌ అగ్ర తార పూజాహెగ్డే స్పందించారు. ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు సర్కస్‌ చిత్రం ఫెయిల్యూర్‌ గురించి ఆమె స్పందించారు.

Pooja Hegde: నా అంచనా తారుమారైంది.. కానీ పేరొచ్చింది!

సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ గురించి టాలీవుడ్‌ అగ్ర తార పూజాహెగ్డే (Pooja hegde) స్పందించారు. ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ (kisikabhaikisikijaan)సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు సర్కస్‌ చిత్రం ఫెయిల్యూర్‌ గురించి ఆమె స్పందించారు. ‘‘నేను నటించే ప్రతి చిత్రాన్ని సొంత బిడ్డలా చూస్తాను. హిందీలో నటించిన ‘సర్కస్‌’ (Cirkus) కూడా అలాంటిదే. ఈ సినిమా సక్సెస్‌ అవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నా. కానీ నా అంచనా తారుమారైంది. సినిమా ఫెయిల్‌ కావడంతో చాలా బాధపడ్డా. రిజల్ట్‌ నిరుత్సాహపరిచినా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. సినిమాలో నా పాత్రకు మంచి పేరొచ్చింది. సినిమా కూడా సక్సెస్‌ అయుంటే మరింత ఆనందంగా ఉండేది’’ అని అన్నారు.

అలాగే ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’లోని ‘ఏంటమ్మా’ పాట గురించి ఆమె మాట్లాడారు. ‘‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. మా సినిమాలో ఎంతోమంది దక్షిణాది నటీనటులు పనిచేశారు. ఆయా విషయాల్లో వారు కూడా శ్రద్థ పెట్టారు. నేను కూడా ఒక దక్షిణాది అమ్మాయినే అయినందుకు గర్వపడుతున్నా’’ అని అన్నారు. సల్మాన్‌ఖాన్‌ - పూజాహెగ్డే జంటగా నటించిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్‌ (Venkatesh) కీలక పాత్ర పోషించారు. ఈద్‌ సందర్భంగా ఈనెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ (SSMB28) చిత్రంలో నటిస్తోంది.

Updated Date - 2023-04-15T17:31:48+05:30 IST