Seetha Kalyana Vaibhogame: ‘సీతా కళ్యాణ వైభోగమే’.. విడుదల ఎప్పుడంటే..

ABN , Publish Date - Apr 10 , 2024 | 05:21 PM

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. టైటిల్ ప్రకటనతోనే పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేసిన మేకర్స్.. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా నిర్మాత అధికారికంగా ప్రకటించారు.

Seetha Kalyana Vaibhogame: ‘సీతా కళ్యాణ వైభోగమే’.. విడుదల ఎప్పుడంటే..
Seetha Kalyana Vaibhogame Movie Still

సుమన్ తేజ్ (Suman Tej), గరీమ చౌహన్ (Garima Chauhan) హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద (Satish Paramaveda) దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’ (Seetha Kalyana Vaibhogame). టైటిల్ ప్రకటనతోనే పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేశారు మేకర్లు. ఈ టైటిల్‌లో ఎంత ఫీల్ గుడ్ ఎమోషన్ దాగి ఉందో.. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అంత వయలెన్స్ కూడా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అందమైన ప్రేమ కథా చిత్రంగా, యాక్షన్ అంశాలతో రాబోతోన్న ఈ మూవీ విడుదల తేదీని తాజాగా నిర్మాత రాచాల యుగంధర్ (Rachala Yugandhar) ప్రకటించారు.

*Tharun Bhascker: తరుణ్ భాస్కర్ కొత్త సినిమా, ఈషా రెబ్బా కథానాయిక


Suman-Tej.jpg

ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని.. ఇకపై ప్రమోషన్స్ మరింతగా పెంచనున్నామని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ మేరకు వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో హీరోయిన్లు ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తున్నారు. హీరో హీరోయిన్ల జంట చూడముచ్చటగా ఉంది. చూస్తుంటే ఆ స్టిల్ పెళ్లి వేడుకలో భాగమనేది అర్థమవుతోంది. గగన్ విహారి విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీత అందిస్తుండగా.. పరుశురామ్ కెమెరా, డి.వెంకట ప్రభు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. (Seetha Kalyana Vaibhogame Release Date)


ఇవి కూడా చదవండి:

====================

*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!

*********************

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

Updated Date - Apr 10 , 2024 | 05:21 PM