Sasivadane: నైజాంలో ‘శశివదనే’ను రిలీజ్ చేస్తోందెవరంటే..

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:44 PM

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్. స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవ్వగా.. ఈ చిత్ర నైజాం ఏరియా పంపిణీ హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది.

Sasivadane: నైజాంలో ‘శశివదనే’ను రిలీజ్ చేస్తోందెవరంటే..
Sasivadane Movie Still

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri), కోమలీ (Komalee) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’ (Sasivadane). గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్. స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన (SaiMohan Ubbana) దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నైజాం ఏరియా పంపిణీ హక్కులను టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాణ సంస్థ సొంతం చేసుకోవడంతో.. సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి.

*Sarangadhariya: సింగర్ కె.ఎస్. చిత్ర పాడిన ఇన్‌స్పిరేషనల్ సాంగ్ విడుదల


Rakshit.jpg

ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘శశివదనే’ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను (Nizam Distribution Rights) ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి సంస్థ (Mythri Movie Distributors LLP) దక్కించుకుంది. రీసెంట్ టైమ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ సంస్థ ఇప్పుడు ‘శశివదనే’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

Updated Date - Apr 06 , 2024 | 10:48 PM