Sarangadhariya: సింగర్ కె.ఎస్. చిత్ర పాడిన ఇన్‌స్పిరేషనల్ సాంగ్ విడుదల

ABN , Publish Date - Apr 06 , 2024 | 09:12 PM

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘సారంగదరియా’. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఎం. ఎబెనెజర్ పాల్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా నుంచి శుక్రవారం మేకర్స్ ‘అందుకోవా...’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. నవీన్ చంద్ర చేతుల మీదుగా విడుదలైన ఈ పాటను సింగర్ చిత్ర ఆలపించారు.

Sarangadhariya: సింగర్ కె.ఎస్. చిత్ర పాడిన ఇన్‌స్పిరేషనల్ సాంగ్ విడుదల
Sarangadhariya Movie Still

రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు దివ్య ఆశీస్సులతో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఎం. ఎబెనెజర్ పాల్ (M Ebenezer Paul) సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా నుంచి శుక్రవారం మేకర్స్ ‘అందుకోవా...’ అనే లిరికల్ సాంగ్‌ (Andukova Lyrical Video Song)ను విడుదల చేశారు. విలక్షణ నటుడు, హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ పాట విడుదలైంది. సాంగ్‌ను విడుదల చేసిన నవీన్ చంద్ర ‘సారంగదరియా’ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

*Katha Venuka Katha: ‘కథ వెనుక కథ’కి ఓటీటీలో మంచి స్పందన


ఈ సాంగ్ విషయానికి వస్తే.. పాటను లెజెండ్రీ సింగర్ కె.ఎస్. చిత్ర (KS Chitra) ఆలపించారు. ఇదొక ఇన్‌స్పిరేషనల్ సాంగ్. ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చాలా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేలా, స్ఫూర్తిని నింపేలా పాట ఉండగా.. రాంబాబు గోశాల పాటకు సాహిత్యం అందించారు. పాట విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. ‘‘మా ‘సారంగదరియా’ సినిమా నుంచి ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్ర (Naveen Chandra)గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. లెజెండ్రీ సింగర్ చిత్రగారు ఈ పాటను పాడటం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.


chitra.jpg

డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు) (Padmarao Abbishetty)మాట్లాడుతూ ‘‘ ‘సారంగదరియా’ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మూవీ నుంచి చిత్రగారు పాడిన ‘అందుకోవా..’ పాటను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పాటను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

Updated Date - Apr 06 , 2024 | 09:19 PM