Sarangadhariya: పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తే..

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:26 PM

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు దివ్య ఆశీస్సులతో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు.

Sarangadhariya: పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తే..
Sarangadhariya Teaser Launch Event

రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ (Saija Creations) పతాకంపై చల్లపల్లి చలపతిరావు దివ్య ఆశీస్సులతో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు)ను (Padmarao Abbisetti) దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మే నెలలో సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లెజెండ్రీ సింగర్ చిత్ర పాడిన ‘అందుకోవా...’ అనే ఇన్‌స్పిరేషనల్ సాంగ్‌తో‌ పాటు ‘నా కన్నులే..’ అనే లిరికల్ సాంగ్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. గురువారం ఈ మూవీ టీజర్‌ను హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

*Krishna From Brindavanam: ఆది సాయి కుమార్ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ మొదలైంది..


ఈ టీజర్‌ను గమనిస్తే.. ఇది పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనేది అర్థమవుతోంది. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో జీవనం కొనసాగిస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందనేది ఈ టీజర్ తెలియజేస్తోంది. మధ్య తరగతి తండ్రిగా విలక్షణమైన పాత్రలో రాజా రవీంద్ర నటించారు. (Sarangadhariya Movie Teaser Released)


sarangadariya.jpg

టీజర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి (Umadevi and Sarat Chandra Challapalli) మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణుకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలుంటాయి. సినిమాను మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు) మాట్లాడుతూ.. నా తొలి చిత్ర టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో ఈ కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 04:26 PM