Krishna From Brindavanam: ఆది సాయి కుమార్ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ మొదలైంది..

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:02 PM

‘లవ్ లీ’ యంగ్ హీరో ఆది సాయి కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆది సాయి కుమార్‌తో ఇంతకు ముందు ‘చుట్టాలబ్బాయ్‌’ అంటూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను గురువారం ఘనంగా ప్రారంభించారు.

Krishna From Brindavanam: ఆది సాయి కుమార్ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ మొదలైంది..
Krishna From Brindavanam Movie Launch Event

‘లవ్ లీ’ యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆది సాయి కుమార్‌తో ఇంతకు ముందు ‘చుట్టాలబ్బాయ్‌’ (Chuttalabbai) అంటూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరి (Veerabhadram Chowdary) ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కబోతోన్న ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ (Krishna From Brindavanam) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను గురువారం కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు (Dil Raju), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi).. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Sai Kumar) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు దిల్ రాజు క్లాప్ కొట్టగా.. ఫస్ట్ షాట్‌కు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఇక స్క్రిప్ట్ అందజేస్తూ సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

*My Dear Donga: యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయ్..


ఈ సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. మా ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజుగారికి, అనిల్ రావిపూడిగారికి థాంక్స్. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత నేను, వీరభద్రమ్ మళ్లీ ఓ సినిమా చేయాలని ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి కథ, స్క్రిప్ట్ దొరికింది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమిది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ‘క్రేజీ ఫెలో’ సినిమాలో నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్నాం. ‘ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే’ అంటూ అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పాటలు ఇస్తున్నారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అన్నారు. హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ.. ఆదితో ఇది వరకు నేను ఓ సినిమా చేశాను. మళ్లీ ఇలా కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. వీరభద్రమ్‌గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్ అని తెలిపారు. (Krishna From Brindavanam Movie Launched)


Krishna-From-Brindavanam.jpg

దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ.. చుట్టాలబ్బాయ్ తరువాత సినిమా చేయాలని నేను, ఆది చాలా కథలు విన్నాం. ఇప్పటికి మాకు టైం, లక్ కలిసి వచ్చింది. మంచి కథ దొరికింది. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఆది సరసన దిగంగనా సూర్యవంశీ నటిస్తోంది. నిర్మాతలు ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ డైలాగ్స్, శ్యాం విజువల్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మీడియాకు థాంక్స్ అని తెలపగా.. సాయి కుమార్ (Sai Kumar) మాట్లాడుతూ.. వీరభద్రమ్ గారికి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే చాలా ఇష్టం. మేం చేసిన ‘చుట్టాలబ్బాయ్’ బాగా ఆడింది. ఆయన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీస్తుంటారు. ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. (Krishna From Brindavanam Movie Opening)

Updated Date - Apr 18 , 2024 | 02:02 PM